ముఖ్యమంత్రికి లేఖ రాసే అర్హత చంద్రబాబుకు లేదు.. జోగి రమేష్
, ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (18:04 IST)
"గ్రామసచివాలయ ఉద్యోగాలలో బిసి మహిళకు ప్రధమర్యాంక్ వస్తే ఆమెను, మా బిసి, ఎస్సిఎస్టి, మైనారిటీ వర్గాలను మా మనోభావాలను దెబ్బతీసేవిధంగా కధనాలు ప్రచురించిన వేమూరి రాధాకృష్ణ ఖబడ్ధార్! పేపర్ ఎక్కడ లీకయిందో చెప్పాలి. నీ పేపర్ ద్వారా నీవు ప్రచురించిన విధానంతో మేం అందరం మనస్దాపానికి గురయ్యాం. అది చెప్పకపోతే నీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుని నిన్ను 420 గా ఈ సమాజం ముందు నిలబెడతాం" అని పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి, ఎంఎల్ ఏ జోగి రమేష్ హెచ్చరించారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబులకు ఇద్దరికి చెబుతున్నాం. అన్నింటికి సమాధానం చెప్పండి. మేం పేపర్ లో రాశాం వాటిని అందరూ నమ్మాలి అనుకుంటే చూస్తు ఊరుకోం.
రాధాకృష్ణా! నీ దగ్గర ఉన్న ఆధారాలను తీసుకురా. రేపోమాపో మా బిసి ఎస్సి ఎస్టి మైనారీటీల తరపున నీ వద్దకు, నీ పత్రికకు వద్దకు వస్తాం. ప్రచురించిన వాటిని నిరూపించలేకపోతే చట్టప్రకారం మీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వేమూరి రాధాకృష్ణను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం.
రాధాకృష్ణ కధనాల ఆధారంగా రెచ్చిపోతున్న చంద్రబాబు విధానాలను కూడా ఎండగడతాం" అని స్పష్టం చేశారు. ఆయన ఇంకా "ఈ రోజు చంద్రబాబు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి లేఖరాయడం జరిగింది. గ్రామసచివాలయ ఉద్యోగాలభర్తీలో అక్రమాలు,అవకతవకలు జరిగాయని రాశారు. అసలు చంద్రబాబుకు లేఖరాసే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాను.
చంద్రబాబు షుమారుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సూటిగా అడుగుతున్నాను. మీరు సిఎంగా ఉన్న కాలంలో ఏ సమయంలోనైనా సరే ఏపిపిఎస్సి ద్వారా లక్ష ఉద్యోగాలకు పైగా భర్తీ చేసిన పరిస్దితి ఉందా? చంద్రబాబూ సవాల్ విసురుతున్నా దమ్ముంటే రా, నిరూపించు. మీడియా ద్వారా అడుగుతున్నాను.
ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు తీసుకువస్తే వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాని ఇలా దిగజారి ప్రవర్తించడం ఏంటి? ఏదో బూతు పత్రిక గాలివార్తలు రాస్తే ఆ గాలి వార్తలు పట్టుకుని చంద్రబాబు ప్రెస్ మీట్ లు పెట్టి సిఎం జగన్ కి లేఖలు రాయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను.
అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే లక్షా 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశాడంటే జగన్ ఓ వీరుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి విలువలు, విశ్వసనీయత ఉన్నవ్యక్తి కాబట్టే ఇంత పెద్దఎత్తున ఉద్యోగాలు మన పిల్లలకు ఇచ్చారు.
అసలు ఆ బూతుపత్రికలో కధనాలు రాయించేదే చంద్రబాబు. పలానారోజున ఆ వార్తలు ప్రచురించాలి.
ఛానల్ లో పలానా టైమ్ లో ప్రసారం చేయాలి అని నిర్ణయించేది కూడా చంద్రబాబే. అవి రాశాక వాటిని పట్టుకుని మీడియా సమావేశాలు పెట్టడం చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా అదే వార్తలను పట్టుకుని ముఖ్యమంత్రికే లేఖ రాస్తున్నారంటే ఎంతగా కుట్రపన్నుతున్నారనేది స్పష్టం అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు జగన్ గ్రామసచివాలయాల ఉద్యోగాలభర్తీ కార్యక్రమం చేపట్టినందుకు బిసిఎస్సిఎసి, మైనారిటీల తరపున ముఖ్యమంత్రి జగన్ ని అభినందిస్తున్నాను. చెప్పిన మాటను చేసి చూపించే వ్యక్తి అయిన జగన్ కి జేజేలు పలుకుతున్నాం. మా పిల్లల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.
ఏపిపిఎస్సిలో పనిచేస్తున్న మా వర్గానికి చెందిన మహిళకు ప్రధమర్యాంక్ వస్తే నీకెందుకు ఏడుపు. అదే మీ వర్గానికి చెందిన వారికి వస్తే చంకలు కొట్టుకుని దండలు వేస్తావే. మా వర్గాలకు వస్తే హర్షించడం పోయి కారుకూతలు కూస్తావా?
22 లక్షలమంది ఈ పరీక్షలలో పాల్గొంటుంటే ఏనాడైనా ఇక్కడ అవకతవకలు జరిగాయి ఇక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నారనే మాట విన్నామా? సజావుగా పారదర్శకంగా, పద్దతిప్రకారం, అవినీతి లేని విధంగా జగన్ గారు పరీక్షలు నిర్వహిస్తే మానవతావిలువలు లేకుండా అక్కసుతో మాట్లాడుతున్నావు.
ఓ పత్రికలో ఓ కధనం వచ్చిందంట దానిని పట్టుకుని ముఖ్యమంత్రికి లెటర్ రాస్తావా? సిగ్గుశరం లేదా నీకు ఓ సవాల్ చేస్తున్నాను. మా వర్గాల ప్రజలకు 50 శాతం రిజర్వేషన్ ల ప్రకారం వేలాది ఉద్యోగాలు ఇచ్చారు. అవిగాక ప్రతిభ ఆధారంగా ఓపెన్ కేటగిరిలలో కూడా మా పిల్లలు ఉద్యోగాలు సాధించారు. అంటే 70 శాతం ఉద్యోగాలు మా పిల్లలకు వస్తే ఏడుస్తావా?
నీవు తల్లకిందులుగా తపస్సు చేసినా సరే నీ మాటలను ప్రజలు విశ్వసించరు. విలువలు లేని వాడు విశ్వసనీయత లేని వాడు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అతనిపేరే చంద్రబాబు. పచ్చపత్రికలు ఎన్నికుట్రలు పన్నినా ఎస్సీ ఎస్టి బిసి మైనారీటిలు జగన్ వెంటే ఉన్నారు" అని పేర్కొన్నారు.
తర్వాతి కథనం