ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే, జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ వ్యవధిలో యూరప్ పర్యటనకు వెళ్లాని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. దీంతో విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని, బెయిల్ నిబంధనలు సడలించాలని కోరుతూ ఆయన బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. దీంతో గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. జగన్ ఇప్పటికే ఓసారి విదేశాలకు వెళ్లివచ్చారని, అందువల్ల ఈ దఫా పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. దీంతో తుదపరి విచారణనను ఈ నల 14వ తేదీకి వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతున్న దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఆయన ఓసారి విదేశాలకు వెళ్లి వచ్చారని గుర్తు చేసింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన సీబీఐ కోర్టు ఈ నెల 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది.