Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొరమీను అంటూ క్యాట్ ఫిష్‌లు అమ్మేస్తున్నారు.. క్యాన్సర్‌తో జాగ్రత్త

కొరమీను అంటూ క్యాట్ ఫిష్‌లు అమ్మేస్తున్నారు.. క్యాన్సర్‌తో జాగ్రత్త
, శుక్రవారం, 18 జూన్ 2021 (22:47 IST)
cat fish
కొరమీను అంటూ క్యాట్ ఫిష్‌లను అమ్మేస్తున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ పెంపకం బయటకు వచ్చింది. పొలాల మధ్యలో చిన్న చిన్న చెరువులలో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు.
 
చేపలలో బాగా డిమాండ్ ఉండే కోరమీనును పోలి ఉండే ఈ చేపను మీసాలు పీకేసి కోరమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో రూ.400లు ఉంటే కోరమీను పేరుతో కిలో రూ.150 ఉండే క్యాట్ ఫిష్‌ను యథేచ్ఛగా అమ్మేస్తున్నారు.
 
కుళ్ళిన మాంసమే ప్రధాన ఆహరంగా పెరిగే ఈ క్యాట్ ఫిష్ కేవలం ఆరునెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్థం చేసుకోవచ్చు. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. అందుకే సుప్రీం కోర్టు దీనిని నిషేధించింది. కానీ.. అక్రమంగా పెంచి కోరమీను పేరుతో అమ్మేస్తున్నారు.
 
ఈ చేపలను తింటే పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్‌లో ఉండే ఒమేగా ఫ్యాట్-6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గొప్ప మనసు చాటుకున్న తమిళ జంట.. రూ.37లక్షల భారీ విరాళం