Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూ వివాదంలో పీవీపీ - హైదరాబాద్ నగరంలో కేసు

Advertiesment
భూ వివాదంలో పీవీపీ - హైదరాబాద్ నగరంలో కేసు
, బుధవారం, 24 జూన్ 2020 (14:24 IST)
ప్రముఖ సినీ నిర్మాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ వరప్రసాద్ భూ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఆయనపై కేసు నమోదైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని భూమి విషయంలో పీవీపీ, అతని అనుచరులు కలిసి తనపై దాడి చేశారంటూ కైలాశ్ విక్రమ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
పైగా, కైలాశ్ విక్రమ్ పేర్కొంటున్న భూములకు సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయనీ పీవీపీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పీవీపీని పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. భూ వివాదంపై ఇరువురిని ప్రశ్నిస్తున్నారు. వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరసాపురం ఎంపీకి వైకాపా షోకాజ్ నోటీసు!?