Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యంపై ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి... ఐద్వా

మద్యంపై  ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి...    ఐద్వా
, శుక్రవారం, 19 జులై 2019 (20:42 IST)
ముఖ్యమంత్రి జగన్ మద్యపాన నిషేధంపై  ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని ఐద్వా రాష్ట్ర అద్యక్ష , కార్యదర్శి బి.ప్రభావతి , డి. రమాదేవి ఒక ప్రకటనలో కోరారు. ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశ పెడుతూ మహా త్మ గాంధీ లక్ష్యాలు సాధించే బడ్జెట్ అని అన్నారు.  

మరి మహాత్మాగాంధీ మహా లక్ష్యం మధ్యపాన నిషేధం. దాన్ని మరచి బడ్జెట్  లో మద్యం ఆదాయాన్న పెంచుతూ ప్రవేశ పెట్టటం సబబు కాదని అన్నారు. గత సం।।రం 6220కోట్లు మద్యం మీద ఆదాయం కాగ ఈ సం।।రం8518 కోట్లు ఆదాయాన్ని ప్రకటించడం సందేహాలను రేకెత్తిస్తున్నది. దీనికి పన్నులమీద వచ్చే ఆదాయం అదనం.

బడ్జెట్లో మధ్యపాన నిషేదంలో భాగంగా బెల్టుషాపులు మూసివేసామని , రెండో విడతగా ప్రవేటు డీలర్ల నుండి యాజమాన్యం ప్రభుత్వానికి మార్చి నియంత్రణ విధిస్తామని అన్నారు. మరి మద్యం తాగడం తగ్గాలి కదా! వినియోగం తగ్గితే ఆదాయం తగ్గుతుంది. బడ్జట లక్ష్యం ఎక్కువ పెట్టారు. ఈ లక్ష్యం మధ్యాన్ని నిషేధించే దిశగా లేదనీ , ప్రభుత్వమే ప్రజల జీవితాలను మద్యం మత్తులో ముంచడం కొనసాగించేదిగా ఉందని అన్నారు.
 
మద్య నియంత్రణ చేస్తామని చప్తూ మరోక ప్రక్క టార్గెట్లు ఇవ్వటం అంటే మధ్యం అమ్మకాలను పరోక్షంగా ప్రోత్సహించడం అవుతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మధ్యం పట్ల సరైన ఆలోచన చేయాలన్నారు. నిషేదం దిశగి అడుగులు వేయాలన్నారు. మధ్యం మత్తు కు బానిసలు అయిన వారిని బాగు చేయుటకు డీ ఎడీక్షన్ , కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, మద్యం మత్తువైపు యువత ఆకర్షితులు కాకుండా అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టన్నారు.

మధ్యం షాపు లను తగ్గించాలని , నూతన మధ్యం పాలసి మద్యాన్ని నియంత్రణచేసే దిశగా రూపొందించాలని కోరారు. షాపులను తగ్గించడమే గాక తాగడాన్ని తగ్గించే వైపుగా చర్యలుండాలని ప్రజలు కోరుతున్నారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జామియా మసీదు అభివృద్ధికి సంపూర్ణ సహకారం.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి