Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనికి చీరా జాకెట్ కడితే అది రోజానే.. భీష్ముడిపై శిఖండిని వదిలినట్లు జగన్ రోజాను?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. రోజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై రోజా చేసిన వ

Advertiesment
శనికి చీరా జాకెట్ కడితే అది రోజానే.. భీష్ముడిపై శిఖండిని వదిలినట్లు జగన్ రోజాను?
, బుధవారం, 7 సెప్టెంబరు 2016 (08:29 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. రోజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై రోజా చేసిన వ్యాఖ్యలను బుద్ధా తప్పుపట్టారు. అంతటితో ఆగకుండా.. శనికి చీరా జాకెట్ కడితే అది ఎమ్మెల్యే రోజా అని.. కరువుకు ప్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. 
 
రోజా టీడీపిలో ఉన్నంతవరకూ తమకు శనిపట్టిందని, ఆమె దివంగత వైఎస్‌ రాజశేఖరెడ్డిని కలిసిన వెంటనే ఆయన ప్రాణాలు కోల్పోయారని బుద్ధా ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల్లో లక్ష కోట్లు దోచుకున్న జగన్ జైలుకు వెళ్లారని, రోజాది ఐరన్ లెగ్ అని రాష్ట్రమంతా తెలుసన్నారు. ఆడవాళ్ళను అడ్డుపెట్టుకుని జగన్‌ రాజకీయం చేస్తే ఊరుకోమని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.
 
రోజా ఏం మాట్లాడిన గట్టిగా మాట్లాడకుండా ఉండటానికి గల కారణం ఆమె మహిళేనని బుద్ధా వెల్లడించారు. భీష్ముడిపై శిఖండిని వదిలినట్టు చంద్రబాబుపై విమర్శలకు రోజాను జగన్ ప్రయోగిస్తున్నాడని ఆయన ఆరోపించారు. కుటిల రాజకీయాల కోసం జగన్ మహిళలను వాడుకుంటున్నాడని ఆయన విమర్శించారు. ఇలా జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ అసత్యపు ఆరోపణలు చేయిస్తున్నారని బుద్ధా విమర్శలు గుప్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకోలేదన్న అసూయతోనే ఢిల్లీ నర్సుపై యాసిడ్ పోసి చంపేశాడు... కోర్టు తీర్పు