Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి చేసుకోలేదన్న అసూయతోనే ఢిల్లీ నర్సుపై యాసిడ్ పోసి చంపేశాడు... కోర్టు తీర్పు

ఢిల్లీకి చెందిన నర్సు ప్రీతి రతిపై యాసిడ్ దాడి, హత్య కేసులో నిందితుడిగా ఉన్న అంకుర్ పన్వర్ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా ప్రకటించింది. ప్రీతి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందనే అసూయతో ముద్దాయి

Advertiesment
Preeti Rathi acid attack
, బుధవారం, 7 సెప్టెంబరు 2016 (07:43 IST)
ఢిల్లీకి చెందిన నర్సు ప్రీతి రతిపై యాసిడ్ దాడి, హత్య కేసులో నిందితుడిగా ఉన్న అంకుర్ పన్వర్ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా ప్రకటించింది. ప్రీతి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందనే అసూయతో ముద్దాయి అంకుర్ యాసిడ్ పోసి, హత్య చేశాడని కోర్టు నిర్ధారించింది. దోషికి బుధవారం కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ కేసు తీర్పు వివరాలను పరిశీలిస్తే...
 
గత 2013లో ప్రీతికి ముంబైలోని కొలబా నావల్ హాస్పిటల్లో (ఐఎన్ఎస్ అశ్విని) స్టాఫ్‌ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ప్రీతి ఉద్యోగంలో చేరేందుకు తన కుటుంబ సభ్యులతో కలసి మే 2న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ నుంచి ముంబై వచ్చింది. అదే రైలులో ఆమెకు తెలియకుండా అంకుర్ దొంగచాటుగా (టికెట్ లేకుండా) ముంబై వచ్చాడు. బాంద్రా టర్మినెస్లో ప్రీతి దిగిన వెంటనే అంకుర్ ఆమెపై యాసిడ్ దాడిచేసి పారిపోయాడు. ఈ ఘటనలో ప్రీతి ఊపరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 1న మరణించింది.
 
దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో ప్రీతిని పెళ్లిచేసుకోవాలని అతను ఆశపడగా, ఆమె తన కెరీర్ దృష్ట్యా నిరాకరించింది. ప్రీతి ముంబైకు వెళ్లకుండా ఆపేందుకు అంకుర్ ప్రయత్నించగా, అతని అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆమె ముంబైకి బయల్దేరింది. దీంతో ఆమెపై యాసిడ్‌ దాడి చేసినట్టు వెల్లడైంది. ఈ కేసులో ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని ముద్దాయిగా తేల్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పక్కింటి వ్యక్తితో సంబంధం ఉందనీ భార్యపై యాసిడ్ పోసిన భర్త