Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళికి అంతా సిద్ధం.. తాళికట్టాల్సిందే తరువాయి.. వరుడు జంప్.. ఎందుకంటే?

పెళ్ళికి అంతా సిద్ధం అయితే పీటలపై కూర్చున్న వరుడు తాళి కట్టే సమయంలో వధువు నచ్చలేదని పెళ్ళిపీటల నుంచి వెళ్ళిపోయాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన పిన్నమ

Advertiesment
bride groom rejects marriage for demand extra dowry in west godavari
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:02 IST)
పెళ్ళికి అంతా సిద్ధం అయితే పీటలపై కూర్చున్న వరుడు తాళి కట్టే సమయంలో వధువు నచ్చలేదని పెళ్ళిపీటల నుంచి వెళ్ళిపోయాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన పిన్నమనేని సూర్యనారాయణ కుమార్తె మాధురికి, కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన ప్రోనవల్లి అహోబలరావు కుమారుడు ప్రదీప్‌‌కు బుధవారం రాత్రి దేవరపల్లిలో ఓ కల్యాణ మండపంలో వివాహం జరగాల్సి ఉంది. 
 
రూ.30 లక్షల కట్నానికి రూ.20 లక్షలు ఒకేసారి ఇచ్చేశారు. తీరా ముహూర్త సమయానికి తనకు పెళ్ళి కుమార్తె నచ్చలేదని వరుడు చెప్పాడు. అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తూ పెళ్ళి పీటల మీద నుంచి వెళ్ళిపోయాడు. వధువు తల్లిదండ్రులు ఎంత బతిమాలినా పెళ్లికుమారుడు ససేమిరా అన్నాడు. దీంతో ఆగ్రహించిన వధువు తండ్రి సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వరుడిని అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకయ్యాజీ.. బడ్జెట్‌పై సంతృప్తి లేదా : అరుణ్ జైట్లీ ప్రశ్న