Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకయ్యాజీ.. బడ్జెట్‌పై సంతృప్తి లేదా : అరుణ్ జైట్లీ ప్రశ్న

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఓ వింతైన ప్రశ్న ఎదురైంది. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మీకు సంతృప్తి లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సరదా ప్రశ్నతో వెంకయ్య ఏం సమాధ

Advertiesment
Venkaiah Naidu
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:01 IST)
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఓ వింతైన ప్రశ్న ఎదురైంది. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మీకు సంతృప్తి లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సరదా ప్రశ్నతో వెంకయ్య ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. 'వెంకయ్యాజీ.. అమరావతి రైతులకు క్యాపిటల్‌ గెయిన్స పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుని బడ్జెట్‌లో ప్రకటించాను. అయినా మీకు సంతృప్తి లేదా!?' అని జైట్లీ గురువారం ఉదయం తనను కలసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును సరదాగా ప్రశ్నించారు. 
 
ఈ విషయాన్ని వెంకయ్య మీడియాతో పంచుకున్నారు. ‘‘ఒకసారి నేనూ, జైట్లీ అమరావతి ప్రాంతంలో పర్యటించాం. ఆ సందర్భంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, రైతు ప్రతినిధులు మాదాల శ్రీనివాస్‌, జమ్ముల శ్యామకిశోర్‌ తదితరులు మమ్మల్ని కలిశారు. రైతులు భూములు అమ్ముకోలేదని, ప్రభుత్వానికి అప్పగించారని... అందువల్ల పన్ను నుంచి మినహాయించాలని కోరారు’’ అని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. 
 
ఈ అంశంపై తర్వాత కూడా తాను జైట్లీతో చర్చించానని తెలిపారు. రైతుల డిమాండ్‌ న్యాయ సమ్మతమేనని, తాను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని అప్పుడు జైట్లీ తనకు హామీ ఇచ్చారన్నారు. గురువారం ఉదయం తాను ఏపీకి సంబంధించిన ఒక పని గురించి జైటీతో మాట్లాడుతుండగా.. ఈ విషయాన్ని గుర్తు చేశారని చెప్పారు. రైతులకు మేలు చేసినందుకు తాను జైట్లీకి కృతజ్ఞతలు తెలిపినట్టు వెంకయ్య మీడియాకు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ ట్రంప్... నేను టెర్రరిస్టునా? సిరియా చిన్నారి సూటి ప్రశ్న... వైరల్‌గా మారిన బాలిక ట్వీట్