Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మపాలు అమృతం పిల్లల పాలిట వరం: ఐసిడిఎసి సీడీపీఓ డి.మమ్మీ

Advertiesment
Breastfeeding
, సోమవారం, 2 ఆగస్టు 2021 (16:15 IST)
నేటి ఆధునిక సమాజంలో రోజు రోజుకూ బిడ్డకు అమ్మపాలు దూరం అవుతున్నాయని, ఈ కారణంగానే శిశువులు చిన్నతనంలోనే అనేక రుగ్మతల బారిన పడుతున్నారని సీడీపీఓ డి.మమ్మీ అన్నారు. 
 
సోమవారం గౌతమి నగర్ లోని  ఎంపిపి స్కూల్ వద్ద  ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలలో ఆమె పాల్గొని గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.  సీడీపీఓ డి.మమ్మీ మాట్లాడుతూ, పిల్లలకు పాలివ్వడం వల్ల అందం కోల్పోతామన్న అపోహలు చాలా మందిలో ఉన్నాయన్నారు.

ఈ విషసంస్కృతిని పట్టణాల నుంచి  పల్లెలకు ఎగ బాకింది. శిశువుకు సరిపడా పోషక పదార్థాలు, కాల్షియం, మాంసకృత్తులు, వివిటమిన్లు, ఐరన్‌ వంటి పలు పోషకాలు ఉన్న ముర్రుపాలు నేటి తరం శిశువులు నోచుకోవడం లేదు. పనిఒత్తిడి, ఉద్యోగం, సంపాదన, రోజు రోజుకు మారుతున్న జీవన శైలి కారణాలతో నేటితరం తల్లులు డబ్బా పాలను ఆశ్రయి స్తున్నారు. ఈ విధానానికి చెక్‌ పెట్ట డానికి ప్రభుత్వం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆగస్టు1 నుంచి7వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 
 
ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కొవ్వూరు 
మండలం లో ఉన్న  ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 114  ప్రధాన అంగన్‌వాడీ /మినీ అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నామన్నారు. వీటిపరిధిలో ప్రస్తుతం 704 మంది గర్భిణులకు, 574 మందికి బాలింతలకు సలహాలు అందిస్తున్నట్లు తెలిపారు. . మొత్తం కొవ్వూరు ఐసిడిఎస్ పరిధిలో 6 నెలల లోపు 573 మంది పిల్లలు ఉన్నారని,  వారందరికీ ఆదివారం నుంచి తల్లిపాల ప్రాముఖ్యతను ఇంటింటికి తిరిగి  వివరిస్తున్నామన్నారు. సోమవారం 314 ఇళ్ల ను అంగన్వాడీ, ఏఎన్ఎమ్, ఆశా కార్యకర్తల తో కూడిన బృందాలు సందర్శించడం జరిగిందన్నారు.

ఈ మండలంలో ఆరునెలల నుంచి  మూడేళ్ల లోపు చిన్నారులు 3182 మంది, 3 నుంచి 6 సంవత్సరాలు పిల్లలు 1933 మంది ఉన్నారని తెలిపారు. ఇంటింటి సందర్శనలో వారికి  పౌష్టికాహారం అందజేసే విషయంలో తల్లులకు అవగాహన కల్పించామని మమ్మీ పేర్కొన్నారు. తల్లిపాలు ఆరోగ్యదాయకమని, ముర్రుపాలను శిశువులకు తప్పకుండా బిడ్డ ఇవ్వాలన్నారు. దీని వల్ల వారిలో వ్యాధినిరోదధక శక్తి పెరుగుతుందని తెలిపారు.

చాలా మంది పిల్లలకు పాలు వివ్వకుండా డబ్బాపాలు పడుతున్నారు. ఇలా చేస్తే వారి ఆరోగ్యానికి మంచిదికాదని, పిల్లలు భవిష్యత్తు లో ఎదుర్కోనున్న అనేక ఆరోగ్య సమస్యల కు మనం చెక్ (బారిన పడకుండా) పెట్టినవారమౌతామని తెలియచేజారు. కొవ్వూరు పట్టణంలో ఇంటింటి సర్వే వివి పద్మజ, జి.శిరీష, కె.రమణమ్మ లు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినారే జ‌యంతి నాడు గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ‌కు స‌న్మానం