ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నందిగామకు చెందిన స్రవంతి అచ్చిపెద్ద నరసింహారావు(పెద్దబాబు) తో సహాజీవనం చేస్తోంది. అయితే ఇరువురి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్రవంతి ఇంటికి వచ్చిన పెద్దబాబు డబ్బుల విషయంలో ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఆవేశంతో ఊగిపోయిన పెద్దబాబు కత్తి తీసుకుని స్రవంతిపై దాడిచేశాడు. ప్రశాంతి ఒంటిపై 20 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా విషయం తెలుసుకున్న స్రవంతి కొడుకు ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. స్రవంతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.
కాగా దాడిచేసిన నిందితుడు పెద్దబాబు నందిగామ మున్సిపల్ కౌన్సిలర్ భర్తగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.