Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేవలం 5 రోజుల్లో బోరుగడ్డకి సినిమా చూపించా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Advertiesment
kotamreddy

ఐవీఆర్

, శనివారం, 19 అక్టోబరు 2024 (17:12 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, ఓ వ్యక్తిని రూ. 50 లక్షల కోసం బెదిరించాడు బోరుగడ్డ అనిల్. బెదిరింపు వ్యవహారంలో పోలీసు కేసులో ఇరుక్కున్నాడు బోరుగడ్డ అనిల్. జగన్ ఒక్కమాట చెబితే చాలు ఆ ఇద్దర్నీ లేపేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్  చేసాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... గతంలో తను పలువురు నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాట నిజమేనని, తనతో అలా చెప్పమని కొందరు నాయకులు తనపై ఒత్తిడి తేవడంతో అలా అన్నానంటూ బోరుగడ్డ వెల్లడించినట్లు సమాచారం. తెదేపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసాననీ, ఆయన కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతానంటూ బోరుగడ్డ అన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
దీనిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... బోరుగడ్డకు వైసిపి ప్రభుత్వ హయాంలోనే చుక్కలు చూపించాను. వైసిపి ప్రభుత్వం వున్నప్పుడే బోరుగడ్డ నాపై అవాకులు చవాకులు పేలాడు. ఫోనులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. తిరిగి నేను మాట్లాడటానికి మనస్కరించలా. ఒక ప్రజాప్రతినిధిగా నా భాషను అలా వాడకూడదని ఓర్పు వహించా. కానీ నా కార్యకర్తలు నెల్లూరు నుంచి గుంటూరు వెళ్లి బోరుగడ్డకు చుక్కలు చూపించి వచ్చారు. కేవలం 5 రోజుల్లోనే బోరుగడ్డకు సినిమా చూపించి వచ్చారు'' అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత.. నిరసనకారులపై లాఠీ ఛార్జ్