Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీ సమావేశాలకు, కేబినెట్ సమావేశాలకు తేడా లేకుండా చేస్తున్నారు: బొండా ఉమా

పార్టీ సమావేశాలకు, కేబినెట్ సమావేశాలకు తేడా లేకుండా చేస్తున్నారు: బొండా ఉమా
, శనివారం, 28 నవంబరు 2020 (07:07 IST)
పార్టీ సమావేశాలకు, కేబినెట్ సమావేశాలకు వైసీపీ తేడా లేకుండా చేసిందని పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేబినెట్ సమావేశాలంటే ప్రజలకి ఏవిధంగా మేలు జరుగుతుందని చర్చించే సమావేశాలన్నారు.

అలాంటి సమావేశాలను తూతూ మంత్రంగా నిర్వహించి మమా అనిపించారన్నారు.  గత మూడు రోజులుగా నివార్ తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. "చేతికొచ్చే పంట నాశనం అయింది. కేబినెట్  సమావేశంలో ఈ విషయాలపై చర్చించలేదు. ఎన్ని ఎకరాల్లో రైతులు పంటలు వేశారు,  ఏ ఏ జిల్లాలో ఏ విధంగా రైతుల్ని ఆదుకుందామని ఈ సమావేశంలో ఎక్కడా చర్చించలేదన్నారు.

నష్టపోయిన రైతులకు వెంటనే. నష్ట పరిహారం ఇవ్వాలి. అధికారుల దగ్గర ఏ జిల్లాలో ఎంత పంట వేశారు అనే లెక్కలున్నా కేబినెట్ లో చర్చకు రాలేదు.. రైతుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. 

18 నెలల కాలంలో అనేక తుఫాన్లు వచ్చాయి. అనేక రకాలుగా నష్టపోయినా ఒక్క రూపాయి కూడా రాల్చిన పాపాన పోలేదు.. రైతులందరిని ఆదుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఫలితం శూన్యం. ఏ ఒక్క మంత్రిగాని, ముఖ్యమంత్రిగాని, అధికారులుగాని ఎవరూ కూడా ఫీల్డ్ పైకి పోలేదు. క్షేత్ర స్థాయిలో సర్వే జరిపించలేదని" డుయ్యబట్టారు.

గతంలో వరదల్లో నష్టపోయినవారికి రూ.500 ఇస్తామంటే కనీసం రూ. 5వేలు ఇవ్వాలని ప్రకటన చేసిన జగన్ ఇప్పుడెందుకు రూ. 500 ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు. కనీసం రూ. 5 వేలు ఇవ్వాలన్నారు.   ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే,  తెలుగుదేశం పార్టీ కోర్టుకెళ్లింది దీని వల్ల రాష్టంలో ముపై లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోతున్నామని వైసీపీ వారు దుష్ప్రచారం చేశారు.

వైసీపీ శుద్ధ అబద్దాలు చెబుతోంది. తాము ఇవ్వద్దని కోర్టుకు వెళ్తే డిసెంబర్ 25 వ తేది ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తోంది? దీనిపై వైసీపీ క్షమాపణ చెప్పాలి. మేం కోర్టుకు వెళ్లి ఉంటే వారు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తున్నారో చెప్పే సత్తా, డమ్ము వైసీపీ ప్రభుత్వానికి లేదు. కోర్టుకు వెళ్లలేదని కేబినెట్ సమావేశమే ఒప్పుకుంది. ఇళ్ళ స్థలాల విషంలో వైసీపీ 4వేల కోట్ల అవినీతికి పాల్పడింది.  గతంలో పేదలకు తెలుగుదేశం పార్టీ మూడు సెంట్ల స్థలం ఇచ్చింది. ప్రస్తుతం వైసీపీవారు ఒక్క సెంటు స్థలం మాత్రం ఇస్తామంటున్నారన్నారు.


పోలవరం ప్రాజెక్టును ఆపారు. ఇది వారి అసమర్థతను తెలుపుతోందన్నారు . 18 నెలల్లో ఒక్క సారి కూడా పోలవరంపై రివ్యూ చేయలేదన్నారు. చంద్రబాబునాయుడు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని అభివృద్ధి చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క శాతం కూడా పనులు ముందుకెళ్లలేదన్నారు. పోలవరం పేరు చెప్పి డబ్బులు దండుకోవడానికి చూస్తున్నారన్నారు.

తమ ప్రభుత్వం పోలవరం లోతు 150 అడుగులు తగ్గించలేదని, 194 టీయంసీల నీరు నిల్వ చేస్తామని చెప్పామని... వైసీపీ ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయలేకపోయిందన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారన్నారు. పోలవరం పనులు ఆపేసిన విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతాం.

ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రకటన చేసేవరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ అసమర్థ పాలనను ప్రజలు గుర్తించారన్నారు. నాయకులు తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని తెలిపారు. ఇక 30 సంవత్సరాల వరకు కూడా కోలుకోలేకపోయే స్థితికి తీసుకొచ్చారని బొండా ఉమామహేశ్వరరావు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడుదశాబ్దాల తరువాత బిడ్డల చెంతకు తల్లి.. కడప జిల్లాలో అపురూప దృశ్యం