వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం వంటివని ఈ ఎన్నికల్లో తనకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని అనుకోవడం లేదని, అందువల్ల ఈ ఎన్నికల్లో తన సైన్యం ప్రజలేనని స్పష్టం చేశారు. నాలుగో విడత జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా క్రోసూరులో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన విద్యను అందించేందుకు ఈ నాలుగేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే రోజునే విద్యాకానుక అందిస్తున్నామని చెప్పారు.
ఆ తర్వాత ఎప్పటిలాగే విపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు చేసే సీఎం జగన్ ఈ దఫా బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమకు అండగా ఉండకపోవచ్చన్నారు.
అందువల్ల జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో తమ సైన్యం ప్రజలేనని అన్నారు. మీ ఇంట్లో మం.చి జరిగిందా లేదా అన్నదే కొలమానంగా తీసుకోవాలని, మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.