Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రౌడీరాజ్యం వద్దు - జగన్ పైన బిజెపి నేత సంచలన వ్యాఖ్యలు

రౌడీరాజ్యం వద్దు - జగన్ పైన బిజెపి నేత సంచలన వ్యాఖ్యలు
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (15:26 IST)
కడపజిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక కాస్త వాడివేడిగా జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముగించుకున్నాయి. అంతేకాదు చివరి రోజు నామినేషన్లను కూడా దాఖలు చేసేశారు. చివరి రోజు నామినేషన్ల పర్వం పూర్తయ్యింది. దీంతో విమర్సలు మరింత తారాస్థాయికి  చేరుకున్నాయి.
 
నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి బిజెపి అభ్యర్థిగా సురేష్, వైసిపి అభ్యర్థిని డాక్టర్ దాసరి సుద, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మలు నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు కావడంతో ఇప్పుడు ఎన్నికలు కాస్త ఆశక్తికరంగా మారుతోంది. 
 
అయితే నామినేషన్ల తరువాత బిజెపి జాతీయ కార్యదర్సి సునీల్ దేవదర్ ఎపి సిఎంపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు. రౌడీ రాజ్యం మనకు వద్దు..కుటుంబ వారసత్వం వద్దు. బిజెపిని గెలిపించండి..రాష్ట్రాన్ని మరింత అభివృద్థి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
 
అంతే కాదు  రాజకీయాలంటే ఎమోషనల్ కాదు..ప్రజలకు సేవ చేస్తూ వారి మధ్యే ఉండాలి..ఎన్నికలు వస్తే పోటీ చేయాలని రాజ్యాంగం చెప్పింది..సిఎం జగన్ అవినీతి, అసమర్థ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారు. నవరత్నాల పేరుతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది.
 
కానీ అవినీతి మాత్రం రాజ్యమేలుతోంది. అభివృద్థి, సంక్షేమాన్ని గాలికి వదిలేసిన వైసిపి అభ్యర్థికి ఓటు వేస్తారో, సేవ చేసేవారికి 
ఓటు వేస్తారో ప్రజలే తేల్చుకోవాలి. కుటుంబంలోని వారు తప్ప వేరెవ్వరూ రాకూడదు. బద్వేల్ లో ఇసుమంత అభివృద్థి అయినా చేశారా..దొంగ ఓట్లలో ఆరితేరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్ల బద్వేలు ఓటర్లు జాగ్రత్తగా ఉండాలి.
 
మంచి సేవాభావాలు కలిగిన సురేష్ ను గెలిపించి అభివృద్థి చెందాలని పిలుపునిచ్చారు. అభివృద్థి కావాలా, ఓట్ల కోసం మభ్యపెట్టే పార్టీ వైపు మ్రొగ్గుచూపుతారో మీ ఇష్టం అంటూ బద్వేలు ఓటర్లను ప్రశ్నించారు. వైసిపి పార్టీ గూండాయిజం, ఆక్రమణలు అన్ని రకాల మాఫియాలకు కేంద్ర బిందువుగా మారిందన్నారు.
 
సిఎం జగన్ హిందువులను విస్మరించి, క్రిస్టియన్లను ప్రోత్సహిస్తున్నారని..ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలనను స్వస్తి పలకాలంటే బిజెపికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బిజెపికి తోడుగా జనేన ఉంటుందని.. ఎన్నికల్లో మిత్రపక్షంగా పనిచేయమని జనసేనను కోరతామన్నారు. అభివృద్ధి కేంద్రానికి, అవినీతి, అక్రమాలు రాష్ట్రానిదన్నారు సునీల్ థియోదర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెంటిస్ట్‌ ప్రేమ పెళ్లి.. మనస్తాపంతో తల్లిదండ్రులు ఆత్మహత్య