Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంబ‌టీ... మంత్రి ప‌ద‌వి కోసం మైకుల ముందు పెర్ఫార్మెన్స్ వ‌ద్దు!

అంబ‌టీ... మంత్రి ప‌ద‌వి కోసం మైకుల ముందు పెర్ఫార్మెన్స్ వ‌ద్దు!
విజ‌య‌వాడ‌ , శనివారం, 1 జనవరి 2022 (11:38 IST)
సిద్ధాంతాల గురించి బిజెపికి నీతులు చెప్పే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, గురువింద సామెతను గుర్తు చేస్తోంద‌ని బీజేపీ ప్ర‌ధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి  అన్నారు. సిద్ధాంతం లేని పార్టీ వైసీపీ, మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడటం సిగ్గుచేట‌ని ఆయ‌న ఎమ్మెల్యే అంబటి రాంబాబును ఉద్దేశించి అన్నారు. 
 
 
మాట తప్పను, మడమ తిప్పను లాంటి మోసపూరిత మాటలతో మద్యనిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అర్ధభాగం ముగిసినా మద్యనిషేధం చేయకుండా, నిషేధం పేరుతో పాతిక రూపాయలు కూడా విలువ చేయని మద్యాన్ని 250 రూపాయలకు అమ్ముకుంటూ పేదవారి రక్తాన్ని జలగల్లాగా పీల్చుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఓట్ల కోసం రేట్ల గురించి మాట్లాడుతున్నామన్నారే, మరి మీరు ఓట్ల కోసం కాకుండా పేద ప్రజలను ఉద్ధరించటానికి మద్యనిషేధం మాటలు చెప్పారా? అని ఎద్దేవా చేశారు.

 
సోము వీర్రాజు వ్యాఖ్యల పట్ల జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని పక్కదోవ పట్టించటానికి గుంటూరు జిన్నా టవర్ సమస్యను లేవనెత్తామని మాట్లాడే ముందు, రాజమండ్రిలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పార్టీ అధ్య‌క్షుడ వ్యాఖ్య‌ల‌ను అర్ధం చేసుకోవాల‌న్నారు. పేదవారి కష్టాన్ని వారి వీక్ నెస్ ను అడ్డం పెట్టుకొని ఇలా దారుణంగా, నిర్దాక్షిణ్యంగా దోచుకునే మీ చర్యలను భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంద‌న్నారు.

 
పక్కదారి పట్టించాల్సిన అవసరం త‌మ‌కు లేద‌ని, గతంలో ప్రొద్దుటూరులో కూడా టిప్పుసుల్తాన్ విగ్రహ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉధృతంగా పోరాడి విజయం సాధించిందన్న విషయం గుర్తు పెట్టుకోవాల‌న్నారు. 
 
 
ముందు గుంటూరులో  జిన్నా టవర్ ఏర్పాటు చేయటం వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవాల‌న్నారు.  1942 లో అక్కడ జరిగిన మత ఘర్షణలలో 14 మంది ముస్లింలకు స్థానిక కోర్టు విధించిన మరణ శిక్షలను రద్దు చేయించిన జిన్నా పేరు మీద ఆ టవర్ కట్టార‌ని తెలిపారు. ఉరిశిక్షలను కోర్టులు ఊరికే విధిస్తాయా? వాళ్ళ చేతిలో ఎంతోమంది హిందువులు హతమయ్యి ఉంటేనే కదా ఉరిశిక్షలను విధిస్తారు. అందుకే నేడు భారతీయ జనతా పార్టీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇలాంటి వాటిని తొలగించాలని, లేదంటే పేర్లు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంద‌న్నారు. ఈ డిమాండ్ ఈనాటిది కాద‌ని, గతంలో ప్రొద్దుటూరు పట్టణంలో జిన్నా పేరు మీద ఉన్న రోడ్డుకు కూడా కొత్త పేరు పెట్టమని సూచించామ‌న్నారు.
 
 
ఇవేవీ తెలుసుకోకుండా మంత్రి పదవి మీద ఆశతో ఇలా మైకుల ముందుకు వచ్చి పెర్ఫార్మన్స్ లు ఇస్తే మీ సినిమా హిట్ కాదు అయ్యేది, అట్టర్ ప్లాప్ అవుతుంది జాగ్రత్త అని ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుకు విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమ‌లేశుడు, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌మూర్తుల‌తో టిటిడి ప్ర‌త్యేక క్యాలెండ‌ర్‌