Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లిని కన్న తనయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు

Advertiesment
KCR
, సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (11:41 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుగారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను' అని తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 
 
అలాగే, తెలంగాణ మంత్రి కె. హరీష్ రావుకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌ దక్షతకు నిదర్శనమన్నారు. ఈ నేలకు కేసీఆరే శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. "తెలంగాణ మీ స్వప్నం, ఈ రాష్ట్రం మీ త్యాగఫలం, ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం, ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష, తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్‌గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు" అంటూ పేర్కొన్నారు. 
 
మరో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 'నాకు తెలిసిన బహుముఖ ప్రజ్ఞశాలి, ధైర్యవంతుడు, దయగలవాడు, ప్రజాకర్షణ కలిగిన క్రియాశీల వ్యక్తి, నేను నాన్న అని గర్వంగా పిలిచే వ్యక్తి.. మీరు దీర్ఘకాలం జీవించాలని, మీ ముందుచూపుతో, నిబద్దతతో మాలో ఇలాగే స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నాను. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు' అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. కేక్‌ కట్‌ చేశారు. స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు వివిధ రకాల సంక్షేమ సహాయాలను అందజేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, అన్నదానాలు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైకు నడుపుతూ.. ఫేస్‌బుక్ లైవ్.. స్కిడ్ అయి కిందపడ్డాడు.. అంతే చనిపోయాడు..