Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిల్ గేట్స్ ఏపీ పర్యటన.. చాయ్, సమోసా ట్రీట్ వరకే.. వైకాపా ధ్వజం

Advertiesment
Bill Gates at Amaravati

సెల్వి

, బుధవారం, 18 ఫిబ్రవరి 2026 (10:13 IST)
ఇది మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించినప్పుడు, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే గొప్ప దృక్పథంతో వచ్చారు. వారు ఏఐ యుగంలో సాంకేతికత, విద్య, వ్యవసాయం, మానవ వృద్ధి, వేగంగా మారుతున్న సాంకేతిక స్పెక్ట్రం గురించి మాట్లాడారు. ఆ రోజున ఎటువంటి వాగ్దానాలు చేయనప్పటికీ, బిల్ గేట్స్ అండ్ మెలిండా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పనులలో చురుకుగా పాల్గొంటోంది. 
 
ఈ నేపథ్యంలో ఏపీలో బిల్ గేట్స్ పర్యటనపై సెటైర్లు విసురుతున్నారు. బిల్ గేట్స్, చంద్రబాబు కలిసి వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రంలో అభివృద్ధిని ప్రపంచం చూసింది. అయితే వైకాపా నేతలు మాత్రం బిల్ గేట్స్ రాకతో ఒరిగేదీ లేదంటూ దుమ్మెత్తిపోస్తోంది. బిల్ గేట్స్ రాక చాయ్, సమోసా ట్రీట్ వరకే నంటూ వైకాపా సెటైర్లు విసిరింది. సమోసా, టీ బిల్లు కోసమే బిల్ గేట్స్ ఆలోచించగలిగారని వైకాపా తెలిపింది. కానీ నెటిజన్ల మాత్రం వైకాపాకు చురకలంటిస్తున్నారు. ప్రపంచం ఎంత దూరం వెళ్లిందో తెలుసుకోకుండా వైకాపా పరధ్యానంలో వుందని ఎద్దేవా చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత