Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

Advertiesment
babu - revanth

సెల్వి

, శనివారం, 6 జులై 2024 (22:11 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య శనివారం జరిగిన తొలి దఫా చర్చలు సఫలమైనట్టు ఇరు రాష్ట్రాల మంత్రులు వెల్లడించారు. ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత భేటీ వివరాలను భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. విభజన సమస్యలపై, ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీతో పాటుగా, అధికారుల కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించినట్టు తెలిపారు. విభజన సమస్యలు ఒక్కటే కాకుండా, గత 5 ఏళ్ళు పట్టి పీడించిన డ్రగ్స్, గంజాయి, సైబర్ క్రైమ్స్‌పై కూడా భేటీలో చర్చ. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని, రెండు రాష్ట్రాల ఏడీజీ స్థాయి అధికారులతో డ్రైవ్ నిర్వహించాలని రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. 
 
అలాగే, అలాగే, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని వారు తెలిపారు. 'గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో మాట్లాడుకున్నాం. రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించాం. సీఎస్‌లు, ముగ్గురు అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తాం. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీని వేయాలని తీర్మానించాం. 
 
అక్కడ కూడా పరిష్కారం కాని అంశాలుంటే ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కార మార్గం కనుగొనాలని నిర్ణయించాం. డ్రగ్స్‌, సైబర్‌ నేరాల కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం' అని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏపీ మంత్రి సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. తెలుగు జాతి హర్షించే రోజు అని వ్యాఖ్యానించారు. విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సీఎంలు మందుకు రావడం శుభపరిణామమన్నారు. డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఏపీ మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్‌ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో ఫ్యాబ్‌లెస్ చిప్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఐపీవీ సన్నాహాలు