Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

Advertiesment
cbn revanth

సెల్వి

, శనివారం, 6 జులై 2024 (18:27 IST)
విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం హైదరాబాద్ నగరంలోని ప్రజా భవన్‌లో శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. 
 
తొలుత ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు.. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్‌లో సమావేశమై రెండు సమస్యలను పరిష్కరించుకుందామని, సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. 
 
ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, శాంతికుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి బి.సి.జనార్దన్‌ రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
 
కాగా, ఈ సమావేశ ఎజెండాలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు అయింది. అప్పటి నుంచి కీలకాంశాలు ఎన్నో పెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా ఎజెండా అంశాలను ఖరారు చేశారు. అవి... 
 
రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు
విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు
ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశాలు
పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు
విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు
ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు
హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశం
లేబర్‌ సెస్‌ పంపకాలు 
ఉద్యోగుల విభజన అంశాలు 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు