జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య కావడం మన తెలుగు వారందరికీ చాలా గర్వకారణం. ఆగస్టు 2 ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించారు పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ సీఈవో జంగా శ్రీనివాస్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ జెండా తయారు చేసిన తెలుగు వాడి గొప్పతనాన్ని కీర్తిస్తూ వాడవాడలా ఆయన జయంతి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన జయంతి ఆగస్టు 2 మరియు వర్ధంతి జులై 4లను జాతీయ పర్వదినాలుగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పింగళి వెంకయ్య గారికి భారతరత్న ప్రకటించాలి అని జంగా శ్రీనివాస్ విజ్ఞప్తి చేసారు.