Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగనన్నతోడు, వైయస్సార్ చేయూత పధకాలకు బ్యాంకులు చేయూతనివ్వాలి

జగనన్నతోడు, వైయస్సార్ చేయూత పధకాలకు బ్యాంకులు చేయూతనివ్వాలి
, సోమవారం, 22 మార్చి 2021 (19:50 IST)
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలకు బ్యాంకులు మరింత తోడ్పాటును అందించాలని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విజ్ణప్తి చేశారు. సోమవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ఆయన అధ్యక్షతన 214వ రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ (ఎస్ఎల్‌బీసి) సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గ‌న మాట్లాడుతూ కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక పధకాలను నిరంతరాయంగా అమలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలను మరింత విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు బ్యాంకులు కూడా అన్ని విధాలా సహకారాన్ని అందించాలని విజ్ణప్తి చేశారు.

ముఖ్యంగా వైయస్సార్ సున్నావడ్డీ పధకం, వైయ్సార్ చేయూత, జగనన్నతోడు, వైయస్సార్ ఉచిత పంటల బీమా పధకం, అందరికీ ఇళ్ళు, టిడ్కో గృహాలు వంటి పధకాలు కార్యక్రమాలకు బ్యాంకులు మరింత తోడ్పాటును అందించాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ణప్తి చేశారు. రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక విప్లవాత్మకమైన రైతు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వాటికి బ్యాంకులు తమవంతు తోడ్పాటును అందించాలని చెప్పారు.

ముఖ్యంగా కౌలు రైతులందరికీ తగిన విధంగా ఋణాలు అందించాలని మంత్రి విజ్ణప్తి చేశారు. రాష్ట్రంలో 130శాతం సిడి రేషియోను నిర్వహించడం పట్ల ప్రభుత్వం తరుపున బ్యాంకరులు అందిరికీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందను తెలిపారు.వైయస్సార్ ఉచిత పంటల బీమా పధకం కింద సుమారు 50 లక్షల మందికి బీమాను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దానికి బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ణప్తి చేశారు.

జగనన్న తోడు కింద చాలా ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరితగతిన ప్రోసెస్ చేసి ఆయా ధరఖాస్తుదారులకు సహాయం అందించాలని చెప్పారు. అంతేగాక ఎస్సి, ఎస్టి, బిసి తదితర వర్గాలకు ఇచ్చే ఋణాలవాటాలో మెరుగైన ప్రగతి కనబ‌ర్చాలని మంత్రి బ్యాంకరులకు సూచించారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే ఋణాలపై వడ్డీని అన్ని బ్యాంకులు ఒకే విధమైన విధానాన్ని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని ఆదిశగా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి రాజేంద్రనాధ్ రెడ్డి బ్యాంకరులకు విజ్ణప్తి చేశారు.
 
రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కౌలు రైతులకు ఋణాలు మంజూరులో మెరుగైన ఫలితాలు సాధించక పోవడంపై గత డిశంబరులో జరిగిన ఎస్ఎల్బిసి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని బ్యాంకరులకు గుర్తుచేసి వచ్చే ఆర్ధిక సంవత్సరంలోనైనా కౌలు రైతులకు మెరుగైన రీతిలో ఋణాలు అందించేందుకు ప్రణాళికల రూపొందించాలని కోరారు.

అలాగే కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య,పశుగణాభివృద్ధి వంటి రంగాల్లోను రైతులకు కూడా సహాయం అందించాలని విజ్ణప్తి చేశారు. అంతేగాక ముఖ్యమంత్రి మానస పుత్రిక రైతు భరోశా కేంద్రాలని వీటిని గ్రామాల్లో బహుళ ప్రయోజనకర కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని కావున వాటిని మరింత బలోపేతం చేసేందుకు బ్యాంకులు అన్నివిధాలా తోడ్పడాలని మంత్రి కన్నబాబు సూచించారు. క్షేత్రస్థాయిలో ఎవరైనా రైతు లేదా ఇతర లబ్దిదారుకు ఏదైనా బ్యంకుతో ఇబ్బంది ఎదురైతే అలాంటి సమస్యలను పరిష్కరించేందుకు కనీసం జిల్లా స్థాయిలోనైనా ఒక టోల్ ఫ్రీ నంబరుతో కూడిన వివాద పరిష్కార కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఎస్ఎల్‌బీసి కన్వీనర్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీయం బ్రహ్మానంద‌ రెడ్డి సమావేశానికి స్వాగతం పలికి సమావేశ అజండా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత డిసెంబరు నెలాఖరు వరకూ వివిధ బ్యాంకులు సాధించిన వార్షిక ప్రణాళిక లక్యాలను వివరిస్తూ రాష్ట్రంల్లో ప్రాధాన్యతా రంగం కింద లక్షా 87వేల 550 కోట్లు ఋణాలు ఇవ్వాల్సి ఉండగా లక్షా 53వేల 474 లక్షల రూ.లు అందించి 81.83శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు.

అలాగే వ్యవసాయ రంగానికి లక్షా 28వేల 660 కోట్లు ఇవ్వాల్సి ఉండగా లక్షా 12వేల 228కోట్లు అందించి 87.23శాతం లక్ష్యం సాధించడం జరిగిందని తెలిపారు.ఎంఎస్ఎంఇ సెక్టార్ కింద 39వేల 600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 33వేల 424 కోట్లు ఇచ్చి 84.40శాతం లక్ష్యం సాధించమైందని చెప్పారు.ప్రాధాన్యేతర రంగం కింద 64వేల 51కోట్లు ఇవ్వాల్సి ఉండగా 77వేల 763 కోట్లు ఇచ్చి 121.41 శాతం లక్ష్యం సాధించమని వివరించారు.
 
నాబార్డు సిజియం సుధీర్ జన్నావర్ మాట్లాడుతూ దేశంలో అత్యధిక మంది కౌలు రైతులకు ఋణాలందిస్తున్న రాష్ట్రం ఎపి అన్నారు. అన్ని బ్యాంకులు మెరుగైన లక్ష్యాలు సాధించడం పట్ల కొనియాడారు. ముఖ్యంగా వ్యవసాయానికి పెద్ద ఎత్తున ఋణం సౌకర్యం అందించడం జరుగుతోందన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా జియం సుందరం శంకర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో క్రెడిట్ రేట్ 6.2శాతంగా ఉండగా ఎపిలో 15.92 శాతంగా ఉండడం అభినందనీయని బ్యాంకరులను కొనియాడారు. ప్రాధాన్యతా రంగంలో మెరుగైన లక్ష్యాలు సాధించారన్నారు.

ఫైనాన్సియల్ ఇన్ క్లూజన్‌పై రిజర్వు బ్యాంకు ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ ఏడాది మూడవ త్రైమాసికం వరకూ బ్యాంకులు మెరుగైన ప్రగతిని సాధించాయని కొనియాడుతూ చివరి త్రైమాసికంలో కూడా ఆశించిన లక్ష్యాలను అధికమించాలని ఆకాంక్షించారు. యుబిఐ సిజియం లాల్‌సింగ్ మాట్లాడుతూ కౌలు రైతులకు ఋణాలు అందించడంలో బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు.

అలాగే ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం కింద మత్స్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున అవకాశాలున్నాయని అందుకు బ్యాంకులు సహకారం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ముఖ్య కార్యదర్శులు ఉదయలక్ష్మి, సునీత, రిజ్వీ పలువురు కార్యదర్శులు, ఇతర అధికారులు, వివిధ జిల్లాల లీడ్ బ్యాంకు మేనేజర్లు, గ్రామీణ బ్యాంకులు చైర్మన్లు, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపముఖ్యమంత్రి అంజద్ బాష కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా