శనివారం నుంచి మంగళవారం వరకు బ్యాంక్‌లు పనిచేయవు. రెండో శనివారం, ఆదివారం కావడంతో 13, 14 తేదీలు బ్యాంక్‌లకు సెలవు దినాలు.
ప్రభుత్వ బ్యాంక్‌ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు సోమ, మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఆదివారం లోగా యూనియన్లు సమ్మె ప్రతిపాదనను ఉపసంహరించుకోని పక్షంలో బ్యాంక్‌లు వరుసగా నాలుగు రోజులపాటు మూసి ఉండనున్నాయి.
ఈ నాలుగు రోజుల్లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథాతథంగా కొనసాగనున్నప్పటికీ, బ్యాంక్ బ్రాంచ్ సేవలు మాత్రం నిలిచిపోనున్నాయి.ఏటీఎం సేవలకూ తీవ్ర విఘాతం కలగవచ్చు.