గంటా కూడా మరో విజయ్ మాల్యానా? ఆస్తుల వేలానికి సర్వం సిద్ధం

సోమవారం, 18 నవంబరు 2019 (14:12 IST)
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా పోయిన వారిలో మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు కూడా ఒకరుగా ఉన్నారు. ఈయన మంత్రిగా ఉన్న సమయంలో రూ.209 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు తిరిగి చెల్లించలేదు. దీంతో గంటాకు చెందిన పలు ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. వీటినే ఇపుడు వేలం వేయనున్నారు. 
 
కాగా, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీగా ఉన్న కంపెనీ రూ.కోట్లల్లో రుణం తీసుకుని చెల్లించకపోవడంతో ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ఆస్తుల వేలానికి బ్యాంక్ రంగం సిద్ధం చేసింది. డిసెంబర్‌ 20వ తేదీన వేలం వేస్తామని ఇండియన్‌ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. 
 
కాగా.. భారీగా రుణం తీసుకుని ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా తిరిగి చెల్లించలేదని గంటా మంత్రి పదవి హోదాలో ఉన్నప్పట్నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. రుణగ్రహితల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ ఉన్నారు. ఇదిలావుంటే, మొత్తం రుణం బకాయిలు రూ.209 కోట్లు కాగా.. తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35.35 కోట్లు అని బ్యాంక్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీ- పెళ్లికాని పురుషులకు మాత్రమే