Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌కు సీఎం యోగం లేదు, 2019 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ సీఎం... జ్యోతిష శాస్త్రవేత్త

ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన సినిమాలు తను చేసుకుంటూ వెళుతున్నారు. కానీ ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త వేణుస్వామి సంచలన విషయాలు చెప్ప

Advertiesment
పవన్‌కు సీఎం యోగం లేదు, 2019 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ సీఎం... జ్యోతిష శాస్త్రవేత్త
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (16:50 IST)
ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన సినిమాలు తను చేసుకుంటూ వెళుతున్నారు. కానీ ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త వేణుస్వామి సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి యోగం ఎట్టి పరిస్థితుల్లో లేదంటూ తేల్చి చెప్పారు. ఐతే 2019 ఎన్నికల అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయంటూ వెల్లడించారు. 
 
కాగా పవన్ కళ్యాణ్‌కు సీఎం యోగం లేదని చెప్పినందుకు ఆయన ఫ్యాన్స్ తనను నోటికి వచ్చినట్లు తిడుతున్నారంటూ ఈ సందర్భంగా యూ ట్యూబులో ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ... " 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడో లేదో తెలియదు. ఆయన జాతకరీత్యా సీఎం యోగం లేదని నేను చెప్పాను. ఇది చెప్పినందుకు నన్ను ద్వేషిస్తున్నారు. ద్వేషించేవారంటే నాకు చాలా ఇష్టం.
webdunia
 
అందుకే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను ఒక్క మాట చెప్పినందుకే ఇలా ద్వేషిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వంటి వివాదాస్పద వ్యక్తిని ఎంతమంది తిడతారు. నన్ను తిడుతూ పోస్టులు పెడితే నాకు నష్టమేమీ లేదు. నంద్యాల ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి ఓడిపోతారని నేను చెప్పలేదు. 2019 ఎన్నికల్లో ఆయనకు యోగ్యత లేదని చెప్పాను.
 
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విషయంలో ఫెయిలయ్యా, అదొక్కటే జరగలేదు. ఇంజీనీర్ అనేవాడు 100 బ్రిడ్జిలు కడితే 5 కూలిపోతాయి. నేనూ అంతే. నన్ను తిడితే నేనేమీ ఫీలైపోను. అలాగని జ్యోతిషం చెప్పేందుకు భయపడను. ఎవరిదైనా చెప్పేస్తాను. నాకు ధైర్యం చాలా ఎక్కువ. అమెరికాలో ఎక్కడెక్కడ వరదలు వస్తాయో చెప్పాను. అవి జరిగాయి కదా.. నాకు అవార్డు ఇవ్వాలి.
 
జయలలిత మరణం గురించి కూడా చెప్పాను. అది జరిగింది. ఇంకా తెలంగాణ సీఎం ఎవరవుతారో చెప్పాను. ఏ పార్టీవాళ్లన్నా ఇష్టం లేదు అలాగని ద్వేషం లేదు. నాకు వాక్‌శుద్ధి వుంది కనుక ఏదైనా జరుగుతుంది. విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండండి. పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఓపిక పట్టండి. నటులు రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు. ఎందుకంటే వారి వ్యక్తిగత జీవితాలు రోడ్డున పడతాయి. పవన్ కళ్యాణ్ జీవితం వివాదాల పుట్ట. అలాంటప్పుడు ఆయన గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శిస్తారో తెలుసా. రెడీగా వుండండి.
webdunia
 
విమర్శించేవారిని మీరు ప్రతివిమర్శలు చేస్తే ఆయన ప్రతిష్ట దెబ్బతింటుంది. సోషల్ మీడియాను ఎదగడానికి ఉపయోగించుకోండి. కత్తి మహేష్ ఒక మాట మాట్లాడితే అతడి పాపులారిటీని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. నా విషయమూ అంతే. మీ పుణ్యమా అని ఇప్పుడు నాకు క్రమక్రమంగా పాపులారిటీ పెరుగుతోంది. 
 
ఎవరి జాతకరీత్యా ఏం జరగాలో అదే జరుగుతుంది. నా పని నేను చేసుకుంటున్నా. మీ విమర్శలు కంటిన్యూ చేయండి. ఓ నమో వేంకటేశాయ'' అంటూ ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరువు హత్య : ఆరుగురికి మరణశిక్ష