Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. బస్సు అడ్డంగా వున్న బైక్ తీయమనేసరికి?

RTC
, శనివారం, 28 అక్టోబరు 2023 (13:12 IST)
RTC
బస్సుకు అడ్డంగా ఉన్న బైక్‌ను తీయాలంటూ హారన్ కొట్టిన ఆర్టీసీ డ్రైవర్‌ను కొందరు దుండగులు బస్సు నుంచి కిందికి లాగి దాడిచేశారు. రోడ్డుపై పడేసి కాలితో తన్నుతూ నానా రభస చేశారు. నడిరోడ్డుపై ఇంత దారుణం జరుగుతున్నా అందరూ చోద్యం చూస్తూ వీడియోలు తీశారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.  
 
బస్సుకు అడ్డంగా ఉన్న బైకును తీయాలని హారన్ కొట్టిన ఆర్టీసీ డ్రైవర్‌ను కొందరు దుండగులు బస్సు నుంచి కిందకి లాగి దాడికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి బయలుదేరింది. 
 
ట్రంకు రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఓ బైక్ అడ్డంగా కనిపించింది. దీంతో బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ బైక్‌ను పక్కకు జరపాలంటూ హారన్ మోగించాడు. 
 
మరోవైపు, వెనక వాహనాలు జామ్ కావడం, అక్కడే పోలీసులు ఉండడంతో బైక్ యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన అతడు తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మొత్తం 14 మంది కారులో వచ్చి ఆర్టీసీ బస్సును వెంబడించారు. 
 
ఓ చోట బస్సును అడ్డుకుని డ్రైవర్‌ను కిందికి దింపి విచక్షణ రహితంగా దాడిచేశారు. రోడ్డుపై పడేసి కడుపులో తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ చెలరేగిపోయారు. 
 
డ్రైవర్ తనను వదిలేయాలని వేడుకున్నా కనికరించలేదు సరికదా, మరింత రెచ్చిపోయారు. చుట్టూ ఉన్నవారు చోద్యం చూస్తూ వీడియోలు తీశారు తప్పితే అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. 
 
చివరికి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై హత్యాయత్నంపై సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై ఇప్పటికే పలు నేరారోపణలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధర: 15 రోజుల్లో రూ. 70 నుంచి రూ.80కి చేరిన వైనం