నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. త్వరలోనే 670 జూనియర్ అసిస్టెంట్స్, మరో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు తెలిపారు.
ఈ సందర్భంగా విజయవాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఎస్ఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ..త్వరలోనే జూనియర్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తాం.
ఒక్కొక్కటిగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాం. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకణంపై ఏపీ హైకోర్టు తీర్పును గౌరవిస్తాము అని తెలిపారు.