ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జరుగనున్న గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదాపడినట్టు ప్రచారం సాగుతుంది. దీనిపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని స్పష్టంచేసింది. పైగా, ఈ నెల 23వ తేదీ ఆదివారం యధావిధిగా ఈ పరీక్షలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేసింది. ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు యధాతథంగా జరుగుతాయని వెల్లడించింది. అభ్యర్థుల తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు 15 నిమిషాలకు ముందుగానే చేరుకోవాలని సూచించింది. అదేసమయంలో ఈ పరీక్షల వాయిదాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏ ఒక్కరూ నమ్మొద్దని స్పష్టం చేసింది.