AP DEMANDS SPECIAL STATUS ట్రెండింగ్ స్టార్ట్, వైజాగ్, తిరుపతి, గుంటూరుకు యూత్...
జల్లికట్టు బిల్లు వచ్చింది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమకారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు AP DEMANDS SPECIAL STATUS ట్రెండింగ్ మొదలైంది. గణతంత్ర దినోత్సవం సాక్షిగా జనవరి 26న ఆంధ్రప్రదేశ్ లోని గుం
జల్లికట్టు బిల్లు వచ్చింది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమకారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు AP DEMANDS SPECIAL STATUS ట్రెండింగ్ మొదలైంది. గణతంత్ర దినోత్సవం సాక్షిగా జనవరి 26న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, తిరుపతి, విశాఖపట్టణంలో ఏపీ ప్రత్యేక హోదాపై యువత ఉద్యమ బాట పట్టబోతోంది. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో యువత తమతమ సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.
ఇదిలావుంటే జల్లికట్టుకు ప్రత్యేక హోదాతో పోలికేంటి? అసలు రాజకీయ పార్టీలు తెలివి వుండే మాట్లాడుతున్నాయా? కేంద్రంతో స్నేహంగా వుంటూ ఏపీకి కావలసినవన్నీ సాధిస్తున్నాం. శత్రుత్వం పెట్టుకుంటే ఆంధ్రకు ఇన్ని నిధులు వచ్చేవా? అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టాలంటూ ఇచ్చిన పిలుపుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో కీచులాడితో ఏదీ సాధ్యం కాదనీ, స్నేహంతోనే సాధించుకుంటామన్నారు.
తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టు ఉద్యమానికి ప్రత్యేక హోదాకు లింకు ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజి రూపంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో మంచి సంబంధాలను చెడగొట్టుకుని నిధులకు బ్రేకులు వేసుకోవాలా అంటు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పైన తిరగబడతామని పవన్ కళ్యాణ్ ట్వీట్స్ ఇచ్చిన నేపధ్యంలో ఆయన స్పందన గమనార్హం.