Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చౌదరి రాజీనామా చేసెయ్... రెడీ సర్.. మరో రెండురోజుల్లో...?

ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి సుజనాచౌదరి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రాకు మొండిచేయి తప్ప మిగిలింది ఏమీ లేదని టిడిపి నేతలే స్వయంగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పార్లమెంటులో పెద్దఎత్తున ఆందోళన

Advertiesment
AP Special Status row
, శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (19:15 IST)
ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి సుజనాచౌదరి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రాకు మొండిచేయి తప్ప మిగిలింది ఏమీ లేదని టిడిపి నేతలే స్వయంగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పార్లమెంటులో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాలను వైసిపి, టిడిపి నేతలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు జనంలోనే చైతన్యం రావడంతోనే బంద్‌కు పూర్తిస్థాయిలో మద్ధతు లభించినట్లయింది.
 
ఇదంతా బాగానే ఉన్నా టిడిపికి సంబంధించి ఇప్పటికే కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఉన్నాయి. అందులో ఒకటి సుజనా చౌదరి, మరొకటి అశోక్ గజపతిరాజు. అశోక్ కీలకమైన విమానయాన శాఖ పదవిని నిర్వహిస్తున్నారు. సుజనా చౌదరి సైన్స్, టెక్నాలజీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఎపికి న్యాయం చేయండంటూ నెత్తీ,నోరు కొట్టుకుంటున్నా ఉపయోగం లేకపోవడంతో ఇక చంద్రబాబు ఇద్దరిలో ఒకరి చేత రాజీనామా చేయించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరికి ఇప్పటికే సిఎం ఫోన్ చేసి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండమని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, సుజనా చౌదరికి ఫోన్ చేసి ఇక్కడున్న పరిస్థితిని పూర్తిగా అర్థమయ్యేట్లు తెలిపారట. మనం ఏదో ఒక స్టెప్ తీసుకుంటే తప్ప ప్రధాని స్పందించే పరిస్థితి కనిపించడం లేదు. ఇక రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిద్దామంటూ బాబు కేంద్రమంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. మరో రెండురోజుల్లోపలే సుజనా తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్థంగా ఉన్నట్లు ఆ పార్టీలోని నాయకులే బహిరంగంగా చెప్పేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీచర్ చెంపదెబ్బ: 11 ఏళ్ల విద్యార్థిని మృతి.. ఎక్కడ?