Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్యా మోదీ... అదే నోటితో ప్రత్యేక హోదా కూడా ప్రకటించవయ్యా... మీ ఒక్క మాట చాలు కదా...!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. అదేమిటయ్యా అంటే, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన రూ. 500, రూ. 1000 నోట్లను నవంబరు 8న ఒకే ఒక్క ప్రకటనతో రద్దు చేసేసి ఆ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్ల

Advertiesment
అయ్యా మోదీ... అదే నోటితో ప్రత్యేక హోదా కూడా ప్రకటించవయ్యా... మీ ఒక్క మాట చాలు కదా...!!
, గురువారం, 24 నవంబరు 2016 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. అదేమిటయ్యా అంటే, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన రూ. 500, రూ. 1000 నోట్లను నవంబరు 8న ఒకే ఒక్క ప్రకటనతో రద్దు చేసేసి ఆ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఆయన అలా చెప్పిన మరుక్షణం పాత నోట్లు రద్దయిపోయాయి. దీనితో దేశంలోని ప్రజలంతా ఇపుడు బ్యాంకుల ముందు కొత్త నోట్ల కోసం క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. నల్లధనం వెలికి తీసేందుకు ఈ చర్య అని ప్రధాని చెప్పారు. ప్రజలు కూడా సరేనని కష్టాలు పడుతున్నారు. 
 
ఐతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం ఓ మాట అంటున్నారు. ఒకే ఒక్క మాటతో రూ. 500, రూ. 1000 నోట్లను మటాష్ చేసేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే నోటితో ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇచ్చేయవచ్చు కదా... ఆయన మాటకు తిరుగులేదని తేలిపోయింది. కాబట్టి అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇచ్చేస్తున్నట్లు ప్రకటిస్తే ప్రధాని మోదీకి పాలాభిషేకం చేస్తామంటున్నారు. మరి మోదీ ఏం చేస్తారో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందంగా ఉండటమే సమస్య.. పై అధికారుల వేధింపులు తట్టుకోలేకపోయా.. నిద్రమాత్రలు మింగేశా...