Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందంగా ఉండటమే సమస్య.. పై అధికారుల వేధింపులు తట్టుకోలేకపోయా.. నిద్రమాత్రలు మింగేశా...

తమిళనాడు రాజధాని చెన్నై ఎగ్మోర్ నరియాంగాడు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళా పోలీస్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉన్నత అధికారుల నుంచి లైంగిక వేధింపులకు తట్టుకోలేక నిద్రమాత్రలు మింగేసింది. వివరాల్లోకి వె

Advertiesment
Woman Armed-Forces cop attempt suicide by consuming sleeping pills : Hospitalized
, గురువారం, 24 నవంబరు 2016 (16:40 IST)
తమిళనాడు రాజధాని చెన్నై ఎగ్మోర్ నరియాంగాడు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళా పోలీస్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉన్నత అధికారుల నుంచి లైంగిక వేధింపులకు తట్టుకోలేక నిద్రమాత్రలు మింగేసింది. వివరాల్లోకి వెళితే.. ఇందుమతి (27) ఆర్మ్డ్ ఫోర్స్‌లో పోలీసాఫీసురాగా పనిచేస్తోంది. ఆమె భర్త బాలమురుగన్‌తో విబేధాల కారణంగా ఒంటరిగా నివసిస్తున్న ఇందుమతి.. బుధవారం రాత్రి మోతాదుకు మించి నిద్ర మాత్రలను మింగేసింది. 
 
స్పృహ కోల్పోయిన ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇందుమతి వద్ద పోలీసులు జరిపిన విచారణలో తాను అందంగా ఉండటమే సమస్యని చెప్పింది. తన అందాన్ని పై అధికారులు వర్ణిస్తున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని.. దీంతో సక్రమంగా విధుల్ని నిర్వర్తించలేకపోతున్నట్లు తెలిపింది. 
 
ఇప్పటికే భర్త నుంచి దూరంగా ఉంటున్న తనకు ట్రాన్స్‌ఫర్ అడిగినా లభించలేదని చెప్పుకొచ్చింది. తన అందమే తనకు ప్రమాదమైందని వెల్లడించింది. అందుకే పరిణామాలు తీవ్రతరం కాకముందే తన జీవితానికి పుల్ స్టాప్ పెట్టేయాలని నిద్రమాత్రలు మింగేసినట్లు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీజీ.. నోట్లను రద్దు చేసిన నా పెళ్లిని ఆపినందుకు థ్యాంక్స్ : ఢిల్లీ యువతి