Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏకగ్రీవాలు ఎందుకు వద్దంటారు? ఎస్ఈసీ మనసులో దురుద్దేశాలు : మంత్రులు బొత్స - పెద్దిరెడ్డి

ఏకగ్రీవాలు ఎందుకు వద్దంటారు? ఎస్ఈసీ మనసులో దురుద్దేశాలు : మంత్రులు బొత్స - పెద్దిరెడ్డి
, బుధవారం, 27 జనవరి 2021 (08:23 IST)
ఎన్నికల్లో ఏకగ్రీవాలను దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయని ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అన్నారు. అలాంటపుడు మన రాష్ట్రంలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను తాము ప్రోత్సహించేలా చర్యలు చేపడుతుంటే.. ఏకగ్రీవాలపై దృష్టిపెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా అంటారని వారిద్దరూ ప్రశ్నించారు. ఖచ్చితంగా ఏకగ్రీవాలపై ఆయనకు ఏదో దురుద్దేశాలు ఉన్నట్టేనని చెప్పారు. 
 
గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేందుకు ఏకగ్రీవాలు దోహదపడతాయని బొత్స వ్యాఖ్యనించారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజలంతా కలిసి ఉండాలన్నారు. గ్రామ సచివాలయాల్లో సర్పంచికి కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకొవాలని ప్రజలను కోరారు. 
 
మంచి పరిపాలనకు కొందరు తూట్లు పొడుస్తున్నారని..,విభేదాల సృష్టి, వర్గాలను ప్రోత్సహించడం తెదేపాకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఏకగ్రీవాలపై దృష్టి పెడతామని ఎస్ఈసీ అంటే ఆయనకు దురుద్దేశాలు ఉన్నట్లేనన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు దీన్ని ప్రోత్సహిస్తుంటే ఎస్​ఈసీ ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ ఎవరికోసం, ఎందుకోసం చేస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు
 
అదేసమయంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సహకరించాలని వారు కోరారు. ఏకగ్రీవాలపై దృష్టి పెడతామని ఎస్ఈసీ అంటే ఆయనకు దురుద్దేశాలు ఉన్నట్లేననని బొత్స వ్యాఖ్యనించారు. ఏం తప్పు చేశారని అధికారులపై ఎస్​ఈసీ చర్యలు తీసుకున్నారో తెలియదని.. ఎన్నికల తర్వాత రీవోక్ చేస్తామని మరో మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్ దాచిపెట్టాడనీ... కన్న తండ్రిని కొట్టి చంపిన కుమార్తె... ఎక్కడ?