తప్పైపోయింది క్షమించండి అంటోన్న మంత్రి సోమిరెడ్డి..!
తిరుమల శ్రీవారి ఆభరణాల మాయం అంటూ వార్తలు రావడం... వివాదస్పదం అవ్వడం తెలిసిందే. అయితే.. ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందీ అనే విమర్శలు వస్తున్నాయి. ‘‘రమణ దీక్షితుల్ని బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటికొస్తాయి.
తిరుమల శ్రీవారి ఆభరణాల మాయం అంటూ వార్తలు రావడం... వివాదస్పదం అవ్వడం తెలిసిందే. అయితే.. ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందీ అనే విమర్శలు వస్తున్నాయి. ‘‘రమణ దీక్షితుల్ని బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటికొస్తాయి..’’ అన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. 24 గంటలు తిరక్కముందే.. ‘‘తప్పుగా మాట్లాడాను క్షమించండి..’’ అని వేడుకున్నారు. విజయవాడలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు.
‘రమణదీక్షితులు గారిని ఉద్దేశించి అన్న మాటలకు క్షమాపణలు చెబుతున్నాను. బ్రాహ్మణుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. నిజానికి నేను ప్రతిపక్షం వారిని విమర్శించాలనుకుని రమణదీక్షితులును అనేశాను.
అయినా, ముఖ్యమంత్రి ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయని ఎవరైనా ఆరోపిస్తే.. తెలంగాణలో అయితే ఖచ్చితంగా బొక్కలో వేసి ఇంటరాగేషన్ చేసేవారు. అసలు వేంకటేశ్వర స్వామి నగల గురించి మాట్లాడినందుకు శిక్షించేవారు..’’ అని సోమిరెడ్డి అన్నారు. సోమిరెడ్డి వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలతోపాటు పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరికి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు.