రమణ దీక్షితులుపై నోరుజారి.. ఆపై సారీ చెప్పిన సోమిరెడ్డి
						
		
						
				
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన పూజారి రమణ దీక్షితులుపై రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవాకులు చెవాకులు పేలారు. శ్రీవారి పింక్ డైమాండ్ వ్యవహారంలో రమణదీక్షితులను జైల్లో పెట్టి నాలుగు
			
		          
	  
	
		
										
								
																	తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన పూజారి రమణ దీక్షితులుపై రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవాకులు చెవాకులు పేలారు. శ్రీవారి పింక్ డైమాండ్ వ్యవహారంలో రమణదీక్షితులను జైల్లో పెట్టి నాలుగు తగిలిస్తే నిజాలు బయటపడతాయంటూ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.
	
	 
	దీంతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెనక్కితగ్గారు. రమణదీక్షితులుకు క్షమాపణలు చెప్పారు. ఆయనపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో సోమిరెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారు. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	తాను బ్రాహ్మణుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తినని.. వైసీపీ నేత సాయిరెడ్డిని అనాల్సిన వ్యాఖ్యలు రమణదీక్షితులను అన్నానని వివరణ ఇచ్చారు. సీఎం ఇంట్లో శ్రీవారి నగలున్నాయన్న సాయిరెడ్డి వ్యాఖ్యలు తనకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని.. ఇంకో రాష్ట్రంలో అయితే సాయిరెడ్డిని లోపల వేసేవాళ్లని అన్నారు.