Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలవరం పనుల్లో అవకతవకల్లేవ్... మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

అమరావతి : నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకులకు తావేలేదని, రెండ్రోజుల కిందట ఢిల్లీ నుంచి వచ్చిన ఎక్స్‌పెర్ట్ కమిటీ కూడా ఇదే స్పష్టం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్ల

Advertiesment
పోలవరం పనుల్లో అవకతవకల్లేవ్... మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
, సోమవారం, 19 మార్చి 2018 (21:31 IST)
అమరావతి : నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకులకు తావేలేదని, రెండ్రోజుల కిందట ఢిల్లీ నుంచి వచ్చిన ఎక్స్‌పెర్ట్ కమిటీ కూడా ఇదే స్పష్టం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మసూద్ హుస్సేన్ అధ్యక్షతన ఉన్న ఎక్స్పెర్ట్ కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులు రెండ్రోజుల కిందట పరిశీలించిందన్నారు. గతేడాది అక్టోబర్ నెలలో తాము పోలవరం పనులు పరిశీలించామని, ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఎంతో ప్రగతి ఉందని ఆ కమిటీ రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపిందని మంత్రి వెల్లడించారు. 
 
3డి నమూనా కూడా సిద్ధమైందని, త్వరలో మిగిలిన డిజైన్లకు సంబంధించి అనుమతులు మంజూరు చేస్తామని కమిటీ తెలిపిందన్నారు. పోలవరం ప్రాజెక్టుల్లో ఎటువంటి అవకతవకులకూ ఆస్కారం లేకుండా పారదర్శకతతో చేపడుతున్నామన్నారు. ల్యాండ్ ఎక్విజేషన్‌కు సంబంధించి నాబార్డు నుంచి నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో నష్టపరిహారం జమవుతోందన్నారు. డయాఫ్రమ్ వాల్ పనులు మే నెలాఖరుకుపూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. దేశంలో 16 జాతీయ సాగునీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు. వాటిలో పోలవరం పనులే శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. 
 
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరవాత తమ ప్రభుత్వ హయాంలో మూడున్నరేళ్లలో రూ.8 వేల కోట్లకు పైబడి ఖర్చు చేశామన్నారు. దాంట్లో కేంద్రం నుంచి రూ.2,727 కోట్లు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. వచ్చే జూన్ మొదటి వారానికి గోదావరి వరద ప్రవాహం పెరుగుతుందన్నారు. ఈ లోగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కోసం వేచిచూడకుండా, ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగడానికి రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులు వెచ్చిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ఆశీస్సులతో ప్రాజెక్టు పనులను లక్ష్యంలోగా పూర్త చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. నీరు ప్రగతి పనులు కూడా శరవేగంగా సాగుతున్నట్లు మంత్రి తెలిపారు.
 
పోలవరం పనుల ప్రగతి...
ప్రతి వారంలాగే సీఎం చంద్రబాబునాయుడ అధ్యక్షతన సచివాలయంలో 54వ వర్చువల్ సమావేశం సోమవారం జరిగిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో తనతో పాటు కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. నేటి వరకూ జరిగిన పనుల వివరాలను మంత్రి వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెత్తనం కోసమే జగన్-బాబు ఫైట్.. జగన్-పవన్‌ను కలిపే శక్తి నాకు లేదు... ఉండవల్లి