Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలవరానికి లిఫ్టులు పెట్టి రూ.400 కోట్లు దొబ్బేశారు : మంత్రి అనిల్

Advertiesment
పోలవరానికి లిఫ్టులు పెట్టి రూ.400 కోట్లు దొబ్బేశారు : మంత్రి అనిల్
, గురువారం, 11 జులై 2019 (11:34 IST)
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ సభ్యులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టుకు సర్వ అనుమతులు ఎవరి హయాంలో వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని గుర్తుచేశారు.
 
ముఖ్యంగా, కేంద్రం నుంచి అనుమతుల తీసుకురావడం దగ్గరి నుంచి కాలువ పనుల వరకూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయని సభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ తవ్వించిన కాలువలకే రెండు లిఫ్టులు పెట్టి టీడీపీ నేతలు రూ.400 కోట్లు దొబ్బేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
దీంతో దొబ్బేయడం(దొంగలించడం) అనే పదాన్ని వాడటంపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. సభాపతి తమ్మినేని సీతారాం కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా, ఆన్‌పార్లమెంటరీ పదాన్ని వెనక్కు తీసుకోవాలని మంత్రికి సూచించారు. 
 
దీంతో చివరికి తన వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి అనిల్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సర్వహక్కులు వైఎస్‌కే ఉన్నాయనీ, ఈ ప్రాజెక్టును పూర్తిచేయబోయేది కూడా తామేనని పునరుద్ఘాటించారు. మొత్తంమ్మీద ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా అనుభవమంత లేదు నీ వయస్సు.. విర్రవీగడం కరెక్టు కాదు : జగన్‌కు బాబు కౌంటర్