Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరద విజువల్స్ కోసం మేమే డ్రోన్ ను ప్రయోగించాం : మంత్రి అనిల్ కుమార్

Advertiesment
Anil Kumar Yadav
, శుక్రవారం, 16 ఆగస్టు 2019 (17:11 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం ఓ డ్రోన్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తన భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారనీ, ‘హై సెక్యూరిటీ’ జోన్‌లో అసలు డ్రోన్‌ను ఎలా ప్రయోగిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుకవున్న వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 
 
దీంతో డ్రోన్ ద్వారా విజువల్స్ తీయాల్సిందిగా తామే ఆదేశించామని ఏపీ జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. వరద పరిస్థితిపై అంచనాకు వచ్చేందుకు విజువల్స్ తీయాల్సిందిగా కోరామని వెల్లడించింది.

రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతం నుంచి మరింత వరద వచ్చే అవకాశముందని చెప్పింది. ఈ నేపథ్యంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ఓ అవగాహనకు వచ్చేందుకే విజువల్స్ తీయాలని నిర్ణయించామని పేర్కొంది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీని నాశనం చేస్తున్న జగన్.. ప్రభుత్వ టెర్రరిజం : మోహన్‌దాస్ పాయ్