Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓట్లు ఎలా అడగాలో తెలియక అవాకులు చెవాకులు పేలుతున్నారు... : ఆదిమూలపు

Advertiesment
ఓట్లు ఎలా అడగాలో తెలియక అవాకులు చెవాకులు పేలుతున్నారు... : ఆదిమూలపు
, శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:12 IST)
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత ప్రజలను ఎలా ఓట్లు అడగాలో తెలియక, ఈ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, అందులో భాగంగా విద్యా శాఖపై పలు విమర్శలు చేశారు. అవన్నీ చూస్తుంటే, అసలు ఆయనకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తున్నట్లు లేదు. అందుకే నాడు - నేడు మనబడిని ప్రస్తావిస్తూ, తాను కట్టిన స్కూళ్లకు ఊర్కే పెయింటింగ్స్‌ వేస్తున్నారని విమర్శించారు. 
 
కానీ తన హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత దుస్థితిలో ఉండేవన్నది చంద్రబాబుకు తెలియదా? అంటూ, చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్ల దుస్థితిపై నాటి మీడియాలో వచ్చిన క్లిప్పింగ్‌లు చూపారు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలోని స్కూళ్ల పరిస్థితిపై పత్రికల్లో వచ్చిన కథనాలు చూపారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలలు అంత దుస్థితిలో ఉన్నాయి.
 
కానీ ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మనబడి నాడు-నేడు చేపట్టింది. తొలి విడతలో 15715 స్కూళ్ల రూపురేఖలను మొత్తం రూ.3700 కోట్ల వ్యయంతో మారుస్తున్నాము. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా 121 స్కూళ్లను రూ.30 కోట్లతో సమూలంగా మార్చేస్తున్నాం. మనబడి నాడు-నేడు తొలి దశ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. 
 
మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. స్కూళ్లలో రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, డ్రింకింగ్‌ వాటర్, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నీచర్, గ్రీన్‌ బోర్డు, భవనాలకు మరమ్మతులు, పెయింటింగ్, ప్రహరీ, ఇంగ్లిష్‌ ల్యాబ్, కిచెన్‌ వంటి సదుపాయాలు కల్పిస్తున్నాం.
ఇంకా కుప్పంలో ఏయే స్కూళ్లను ఎలా మార్చారో చెప్పిన మంత్రి ఆ ఫోటోలు చూపారు.
 
ఈ విధంగా స్కూళ్లలో అని వసతులు కల్పిస్తూ, వాటి రూపురేఖలు సమగ్రంగా మారుస్తుంటే, చంద్రబాబు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మేము ఎక్కడైనా మీరు కట్టిన స్కూళ్లకు రంగులు వేసి ఊర్కుంటే చూపించండి. మేము సవాల్‌ చేస్తున్నాము. కానీ మీరు అలా చూపించకపోతే ఏం చేస్తారో కూడా చెప్పండి. రాజకీయాల నుంచి తప్పుకుంటారా చెప్పండి. లేక తాను ఇలాగే అబద్ధాలు చెబుతానని ఒప్పుకుంటారా?.
 
కానీ సీఎం వైయస్‌ జగన్, చదువు ద్వారానే పిల్లల భవిష్యత్తును మార్చవచ్చని నమ్ముతున్నారు. అందుకే ఎన్నెన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పూర్తిగా మారుస్తూ, పౌష్టికాహారంతో కూడిన మెనూ జగనన్న గోరుముద్ద ద్వారా అందిస్తున్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జగనన్న విద్యాదీవెన, హాస్టల్‌ ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన, స్కూల్‌ బ్యాగ్, బుక్స్‌తో కూడిన జగనన్న విద్యాకానుక అమలు చేస్తున్నాం.
 
అమ్మ ఒడి కింద ఇస్తున్న రూ.15 వేలు నాన్న బుడ్డి కింద తీసేసుకుంటున్నారని, అవి అందుకు కూడా సరిపోవడం లేదని కూడా చంద్రబాబు అంటున్నాడు. అసలు అమ్మ ఒడి పథకం ఔన్నత్యం, విశిష్టతను నాన్న బుడ్డి అంటూ పోలుస్తున్నారు. అలా పోలిస్తే కనీసం బుడ్డి బాబులు అయినా తిరుపతి ఉప ఎన్నికలో ఓట్లు వేస్తారని చంద్రబాబు అనుకుంటున్నట్లు ఉన్నారు. నిజానికి అమ్మ ఒడి పథకాన్ని జాతీయ నూతన విద్యా విధానంలో కూడా ప్రస్తావించి ప్రశంసించారు.
 
చంద్రబాబు మాటలను ఎవరూ లెక్క చేయడం లేదు. మండల, జడ్పీ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించినా, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దగా పట్టించుకోలేదు. చాలా చోట్ల వచ్చి ఓటేశారు. కాబట్టి చంద్రబాబును ప్రజలు కూడా అస్సలు విశ్వసించడం లేదు. రేపు తిరుపతి ఉప ఎన్నికలో కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కల్లోలం, బెడ్లు కొరత, టీకాలు అయిపోతున్నాయి