Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీని కొత్త ప్ర‌భువు పాలిస్తున్నాడు : కాట్ర‌గ‌డ్డ ప్రసూన

Advertiesment
AP
, సోమవారం, 4 జనవరి 2021 (12:48 IST)
ఏపీలో హిందు దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. వైకాపా అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి హిందువుల‌పై, హిందు దేవాల‌యాల‌పై దాడులు ఎక్కువ‌య్యాయ‌ని మండిప‌డ్డారు.

ఇక్క‌డ ఉన్న‌ది ప్ర‌జాస్వామ్య‌మా లేక మ‌తప‌ర‌మైన రాష్ట్రామా అని ప్ర‌శ్నించారు. ఇలా రాష్ట్రంలో మ‌త మార్పిడిలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలిస్తుంద‌ని సాధ‌ర‌ణ మ‌నిషి కాద‌ని... అత‌ను ఒక కొత్త ప్ర‌భువు అని అన్నారు.

ఇలా హిందువుల‌పై దాడులు చేస్తూ పోతుంటే చూస్తు ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. ఇప్పుడు హిందువులంతా ఏక‌మయ్యే స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ద‌ని పేర్కొన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు భ‌విష్య‌త్తులో జ‌రిగితే ప్ర‌తి ఘ‌ట‌న తీవ్రంగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.
 
ఖబడ్దార్ జగన్ రెడ్డి : కింజరాపు అచ్చెన్నాయుడు
హత్యలతో టీడీపీ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఖబడ్దార్ జగన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ను హత్యల ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు. గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ అంకులును దారుణంగా హత్య చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. తలకెక్కిన అహంకారాన్ని, మదాన్ని దించే రోజులు మీకు దగ్గర పడ్డాయి.

వైసీపీని ప్రజలు మోకాళ్ల మీద నిలబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే వారానికొక టీడీపీ కార్యకర్తను పొట్టనపెట్టుకుంటున్నారు. మీరు చంపేటప్పుడు కనీసం వారి భార్యా పిల్లలైనా గుర్తుకురావడం లేదా? రాష్ట్రంలో క్రూరత్వాన్ని జగన్ రెడ్డి పాలుపోసి పెంచుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్ధం అవుతోంది.

పులివెందుల ప్యాక్షనిజాన్ని  రాష్ట్ర వ్యాప్తం చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. ఏ నియంత పాలనలోనూ లేని అరాచకాలు, దౌర్జన్యాలు జగన్ రెడ్డి పాలనలో చూస్తున్నాం. ఆటవిక యుగంలో ఉన్నామా? కిరాతక పాలనలో వున్నామా? పోలీసు వ్యవస్థ వైసీపీ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇవడంతో అధికారం పార్టీ నాయకులు, కార్యక్రర్తలు ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నారు.

అధికారం శాశ్వతం కాదన్న ఒక్క విషయం గుర్తుంచుకోండి. ప్రశ్నిస్తే దాడులు..నిలదీస్తే హత్యలు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొల్పారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికే విధంగా ప్రజలను అణగదొక్కుతున్నారు.

వడ్డీతీ సహా తిరిగి చెల్లించే రోజులు రాబోతున్నాయి. మీ పాపాల చిట్టా అంతా ఉంది.  బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా నిలబడుతుంది.నిందితులను 24 గంటల లోపు అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం