ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 15వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతాయి. ఆ తర్వాత ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు సమయ నిర్ణయం పట్టికను రిలీజ్ చేసింది.
ఈ పరీక్షలన్నీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మాత్రం ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. అలాగే, ఎన్వీరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షను కూడా ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.
ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 25వ తేదీ వరకు వరకు, ఏప్రిల్ 30 నుంచి మే 10వ తేదీ వరకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేలా టైమ్ టేబుల్‌ను రిలీజ్ చేశారు.