Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ వెనకడుగు వేసిన జగన్ సర్కారు : జీవో నంబరు 2 రద్దు

Advertiesment
మళ్లీ వెనకడుగు వేసిన జగన్ సర్కారు : జీవో నంబరు 2 రద్దు
, మంగళవారం, 4 జనవరి 2022 (17:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు వెనకడుగు వేసింది. గతంలో జారీ చేసిన జీవో నంబరును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది.
 
గతంలో గ్రామ సర్పంచులు, కార్యదర్శుల అధికారాలను వీర్వోలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబరు 2ను జారీ చేసింది. ఈ జీవోను గ్రామ సర్పంచులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూ, హైకోర్టులో సవాల్ చేశారు. 
 
దీనిపై విచారణ జరుగుతూ వచ్చింది. ఈ విచారణలో జీవో నంబరును 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని సర్పంచుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో సదరు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. 
 
తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వం అడ్వకేట్ హాజరై.. ఈ జీవో నంబరు 2ను వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు తెలిపారు. దీంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచదార కోటా త‌గ్గించేశారు... కందిప‌ప్పు రేటు పెంచేశారు!