కేంద్రం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం హస్తిన పర్యటనకు వెళుతున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు.
గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే గవర్నర్ల సదస్సుకు బిశ్వభూషణ్ హాజరుకానున్నారు. బుధవారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని గవర్నర్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు గవర్నర్ రానున్నారు.
గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటంతో ఏపీ ప్రభుత్వం గుండెల్లో గుబులు మొదలైంది. ఏపీ సర్కారు చేస్తున్న అన్ని రకాల రుణాల ఒప్పందాల్లో గవర్నర్ పేరును ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. ఇది పెద్ద వివాదాస్పదంగా మారింది.