Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిక్కుల్లో శాంతి.. ఆరు అభియోగాల నమోదు... 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్న కమిషనర్

shanthi

వరుణ్

, బుధవారం, 24 జులై 2024 (08:34 IST)
సస్పెండ్‌కు గురైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఆరు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వీటికి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసులు జారీచేశారు. గత వైకాపా ప్రభుత్వంలో అధికార పెద్దలో అంటకాగి అధికార దర్పాన్ని ప్రదర్శించారు. పైగా, వైకాపా పెద్దల అండ చూసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. తన హోదాను దాటి తనకంటే పై అధికారుల విధుల్లో జోక్యం చేసుకుని వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అనేక భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ఇపుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో వీటన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆమె దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. 
 
గత 2020లో అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శాంతి విశాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అండదండలతో విశాఖ తనదే అన్నట్లు చక్రం తిప్పారు. అధికార దర్పంతో చెలరేగిపోయారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారులను లెక్క చేయకుండా, వారి ఆదేశాలను పాటించకుండా భూములు ధారాదత్తం చేశారు. తనకు ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ తెప్పించుకున్నారు. సర్వీస్‌లోకి వచ్చిన కొత్తలోనే వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అండదండలతో విశాఖ, ఎన్టీఆర్ వంటి ప్రధాన జిల్లాల్లో అసిస్టెంట్ కమిషనర్ చాన్స్ కొట్టేశారు. 
 
ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఉన్నప్పుడు ఆమె విజయవాడ బ్రాహ్మణ స్ట్రీట్‌లో ఉన్న వెంకటేశ్వరస్వామి షాపుల లీజు విషయంలో కమిషనర్‌కు తప్పుడు నివేదిక పంపించారు. దీనిపై ఆమెను కమిషనర్ సస్పెండ్ చేశారు. ఆమె విజయవాడ హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని, దాటి వెళ్లడానికి వీల్లే దని పేర్కొన్నారు. ఒకవైపు సస్పెన్షన్‌లో ఉన్న ఆమెకు వ్యక్తిగత వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. తన వ్యక్తిగత వ్యవహారంపై కమిషనర్ అనుమతి లేకుండా పెట్టిన మీడియా సమావేశం ఇబ్బందుల్లోకి నెట్టింది. 
 
పైగా, ఆమె భర్త మదన్ మోహన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో దానిపై ఆమె వివరణ ఇచ్చారు. మరోవైపు విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. శాంతి, ఆమె భర్త మదన్ మోహన్ వ్యక్తిగత వ్యవహారం కాస్త దేవదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా తయారైంది. ఇలాంటి వ్యవహారాల వల్ల శాఖ పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. దీంతో దేవదాయ శాఖ కమిషనర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. 
 
విధుల్లో చేరినప్పుడు, తర్వాత ప్రసూతి సెలవుల కోసం కమిషనరేట్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా శాంతి తన భర్త పేరు మదన్ మోహన్‌గానే రికార్డుల్లో నమోదు చేశారు. కానీ మీడియా సమావేశంలో మాత్రం మదన్ మోహన్‌తో విడాకులు తీసుకున్నానని, తన భర్త సుభాష్ అని పేర్కొన్నారు. సీసీఎల్ నిబంధనల ప్రకారం దీనిపై వివరణ ఇవ్వాలని కమిషనర్ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
అలాగే, కమిషనర్ అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించడంపై కూడా వివరణ ఇవ్వాలని కోరారు. మొత్తంగా ఆమెపై ఆరు అభియోగాలు నమోదు చేశారు. ఇందులో ముఖ్యంగా అనకాపల్లి సిద్ధిలింగేశ్వరస్వామి ఆలయం భూములు, విఘ్నేశ్వర స్వామి ఆలయం, పెద్దేశ్వరమ్మ ఆలయం, చోడవరంలోని హర్డేంజ్ రెస్ట్ హౌస్, పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయం, విశాఖలో ధర్మలింగేశ్వరస్వామి ఆలయాలకు సంబంధించిన షాపులను అక్రమంగా లీజుకు ఇచ్చేశారు. ఈ విషయంపై ఆర్జేసీ, డీసీ కూడా సమాచారం ఇవ్వలేదు. వీటన్నింటిపై ఆ 15 రోజుల్లోగా కమిషనర్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్మల్‌లో భారీ స్థాయిలో దాడులు చేసి నకిలీ విడిభాగాలపై ఉక్కుపాదం మోపిన పియాజియో ఇండియా