Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ బిడ్డకు తండ్రిని నేనా లేదా ఆ ఇద్దరిలో ఎవరు?: శాంతి భర్త మదన్ మోహన్ ప్రెస్ మీట్ (Video)

madan mohan

వరుణ్

, శుక్రవారం, 19 జులై 2024 (19:03 IST)
సస్పెండైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, తన భార్య కె.శాంతి జన్మనిచ్చిన మగబిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఆమె భర్త మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నారు. ఏ భర్త కూడా తన భార్యపై ఇలాంటి హేయమైన నిందారోపణలు చేయరన్నారు. కానీ, తన భార్య చెప్పినప్రకారం ఆమె జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి వైకాకా రాజ్యసభ్యుడు విజయసాయి రెడ్డి అని తెలుస్తుందన్నారు. కానీ, ఆస్పత్రి రికార్డుల ప్రకారం ఆమె భర్త పేరు గత వైకాపా ప్రభుత్వ మాజీ అడ్వకేట్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పేరుందని గుర్తు చేశారు. దీంతో తనకే గందరగోళంగా ఉందన్నారు. శాంతి జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి తానా? లేక విజయసాయి రెడ్డినా? లేక పోతిరెడ్డి సుభాష్ రెడ్డా? అన్నది తేలాల్సి వుందన్నారు. 
 
ఇదే విషయంపై పోతిరెడ్డి సుభాష్ రెడ్డి వద్ద తాను విచారించగా, తనకు ఆ బిడ్డకు ఎలాంటి సంబంధం లేదని, తనకు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉందని చెప్పారని తెలిపారు. ఇపుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వెల్లడించారు. అందువల్ల ఈ సమస్యకు ఏకైక పరిష్కార మార్గం ఒక్క డీఎన్ఏ టెస్టు మాత్రమేనని తెలిపారు. ఇందుకోసం తాను న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డిలకు డీఎన్ఏ టెస్టులు చేసేలా ఆదేశించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, ఇది నేడో రేపో విచారణకు వస్తుందన్నారు. 
 
దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి సస్పెండ్... ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు
 
ఏపీ హిందూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిపై సస్పెండ్ వేటుపడింది. గత వైకాపా ప్రభుత్వంలో కొందరు పెద్దల అండ చూసుకుని ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అనేక అక్రమాలకు తెరలేపారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసి, ఆమెపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశించింది. 
 
కాగా, ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన కె.శాంతి అంశాన్ని పరశీలిస్తే, గత 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకూ ఆమె సహాయకమిషనర్‌గా పని చేశారు. ఆమెకు మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలోని దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్దంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలకమండలి సభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నాటి అవకతవకలపై నివేదిక పంపించారు. ఇందులో వివిధ అంశాలు పొందుపరిచారు. 
 
నాటి ఉల్లంఘనలపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు జిల్లా శాఖ నుంచి నివేదిక పంపించారు. ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. విశాఖ జిల్లా ధారపాలెం ధారమల్లేశ్వరి స్వామి ఆలయానికి చెందిన దుకాణాలను ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్ రోడ్డులో సిద్దేశ్వర స్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోని హార్డింగ్ రెస్ట్ హౌస్, పాయకరావుపేటలో పాండురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం నిర్వహించకుండా నచ్చినవారికి కట్టబెట్టారు.
 
సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అప్పటి ఉప కమిషనర్ పుష్పవర్ధన్‌పై దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై ఇసుక పోశారు. లంకెలపాలెం వద్ద దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు అప్పగించేశారు. అంతేకాకుండా సదరు నిర్వాహకుడు ఆ తర్వాత సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం లీజుదారులు, ఆలయాల వద్ద వ్యాపారాలు చేసే వారిని పాలకమండలి సభ్యులుగా నియమించకూడదు. ఇందుకు విరుద్ధంగా అక్కడ జరిగింది. నగరంలోని పలు దేవాలయాలకున్న లీజు దుకాణదారుల మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి పలు పనులు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి. ఇలా అనేక అక్రమాలకు ఆమె పాల్పడినట్టు నివేదికలు వస్తున్నాయి. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవసరమైన ఉపశమనం కోసం నెబులైజర్‌లను ఉపయోగించాలని OMRON హెల్త్‌కేర్ ప్రచారం