Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీట్ ప్రవేశ పరీక్ష ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు

Advertiesment
nurse hospital
విద్యా రంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలను నీట్ యూజీ పరీక్ష ఆధారంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేశారు. 
 
2026-27 విద్యా సంవత్సరానికిగాను నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షలు విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, నర్సింగ్ కోర్సు ప్రవేశాలకు ఉత్తమ విధానంపై చర్చించారు. ఆ తర్వాత నీట్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
కాగా, దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య కాలేజీల్లో ఎంబీబీఎస్, ఎండీఎస్, బీవీఎస్సీ, ఇతర భారతీయ సంప్రదాయ వైద్య కోర్సుల్లోని సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ పరీక్షల ద్వారానే ఏపీలో బీఎన్సీ నర్సింగ్ కోర్సుల్లోని సీట్ల భర్తీ చేపట్టనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2025లో సుమారు 1,200 కోట్ల అవాంఛనీయ కాల్స్ బ్లాక్ చేసిన ట్రూకాలర్