Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుయా ఆస్పత్రిలో కోవిడ్ రోగుల మృతులపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

Advertiesment
రుయా ఆస్పత్రిలో కోవిడ్ రోగుల మృతులపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
, మంగళవారం, 11 మే 2021 (12:23 IST)
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మృతి చెందడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు  సీఎంఓ కార్యాలయ అధికారుల ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ అందించిన వివరాలను ముఖ్యమంత్రికి సీఎంఓ అధికారులు వివరించారు. 
 
తనకు పూర్తి స్థాయి నివేదిక కావాలని ఈ సందర్భంగా జగన్ ఆదేశించారు. ఘటనకు దారి తీసిన కారణాలను గుర్తించాలని... ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా తక్షణమే అన్ని చర్యలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. కేవలం ఆక్సిజన్ సేకరణపైనే కాకుండా, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలపై కూడా దృష్టి సారించాలని అన్నారు.
 
మరోవైపు, కరోనా కష్టకాలంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఎంతో మంది పేషెంట్ల చావుకు కారణమవుతున్న విషయం తెల్సిందే. ఏపీలో ఇది మూడో సంఘటన. తొలుత అంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. ఆ తర్వాత కర్నూలులో జరిగింది. ఇపుడు తిరుపతి రుయా అస్పత్రిలో చోటుచేసుకుంది. 
 
ఇలా ఆక్సిజన్ అందక ప్రతి రోజు దేశ వ్యాప్తంగా ఎంతో మంది కరోనా బాధితులు మృతి చెందుతున్నారు. అలాంటి విషాదకర ఘటన మరొకటి తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటుచేసుకోవడంతో ఏపీ రాజకీయయ నేతలంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో... ఆక్సిజన్ సపోర్ట్ పై ఉంటూ చికిత్స పొందుతున్న 11 మంది పేషెంట్లు ప్రాణాలు వదిలారు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన పట్ల ప్రతి ఒక్కరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుయా ఆస్పత్రి లోగుట్టు అంశాలెన్నో.. ఒకే ఒక్క జూనియర్ వైద్యుడు..