Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బోయలకు దేవుడు చంద్రబాబు... వాల్మీకి, బోయ ఫెడరేషన్ చైర్మన్

అమరావతి: రాష్ట్రంలో వాల్మీకి, బోయల స్థితిగతులను అర్థం చేసుకొని, వారిని ఎస్టీల జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోయల దేవుడని వాల్మీకి, బోయ ఫెడరేషన్ చైర్మన్ బిటి నాయుడు అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవ

బోయలకు దేవుడు చంద్రబాబు... వాల్మీకి, బోయ ఫెడరేషన్ చైర్మన్
, బుధవారం, 6 డిశెంబరు 2017 (21:57 IST)
అమరావతి: రాష్ట్రంలో వాల్మీకి, బోయల స్థితిగతులను అర్థం చేసుకొని, వారిని ఎస్టీల జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోయల దేవుడని వాల్మీకి, బోయ ఫెడరేషన్ చైర్మన్ బిటి నాయుడు అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పరంగా, ప్రభుత్వ పరంగా అందవలసిన పథకాలు, అక్షరం, విద్య, ఉపాధి అవకాశాలు అందక అనేక బాధలు పడుతూ 61 ఏళ్లుగా పోరాటం చేస్తున్న వాల్మీకులకు, బోయలకు సీఎం న్యాయం చేయదలుచుకున్నారని, అందుకు తమకు సంతోషంగా ఉందని అన్నారు. 
 
1956లో రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను కుట్ర పూరితంగా మూడు ముక్కలుగా చేశారని పేర్కొన్నారు. బ్రిటీష్ వారి పాలనలో ఎరుకలు, యానాది, లంబాడీలను క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద పోలీస్ స్టేషన్లలో పెట్టడం, జైళ్లకు పంపడం చేసేవారని, అంతేకాకుండా వారిపై నేరస్తులుగా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవల్లో చంపేది, చచ్చేది, జైళ్లో ఉండేది బోయలేనని తెలిపారు. ఆ ప్రాంతంలోని రౌడీ షీటర్లలో, జైళ్లలో ఉండేవారిలో అత్యధికులు వాల్మీకులు, బోయలేనని చెప్పారు. తమను ఎస్టీల జాబితాలో చేర్చమని గతంలో అందరు ముఖ్యమంత్రులను అడిగినా ఫలితంలేదన్నారు.
 
సీఎం చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా తమ పరిస్థితులను తెలుసుకొని తమ సమస్యను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత గవర్నర్ ప్రసంగంలో చేర్చారని, ఎస్టీ,ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ కారెం శివాజీ నాయకత్వంలో బహిరంగ విచారణ జరిపించారని వివరించారు. ఆ తరువాత 10 మంది మేథావులతో సత్యపాల్ కమిటీనీ ఏర్పాటు చేసి బోయల స్థితిగతులను అధ్యయనం చేయించి, వారిని ఎస్టీల జాబితాలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ మంత్రి మండలిలో తీర్మానం చేయించి, ఆ మరుసటి రోజునే శాసనసభలో ఆమోదింప చేసిన చంద్రబాబు బోయలకు దేవుడులాంటి వారన్నారు. అటువంటి నేత చంద్రబాబుకు వచ్చే ఏడాది మార్చిలో లక్ష మంది బోయల సమక్షంలో సన్మానం చేస్తామని ఆయన చెప్పారు. వాల్మీకీ, బోయలను ఎస్టీల జాబితాలో చేర్చాలని తీర్మానం చేయడంలో సహకరించిన మంత్రులు లోకేష్ బాబు, కాలవ శ్రీనివాసులు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 16 నుంచి బాపట్ల సూర్యలంకలో మిలటరీ శిక్షణ... 100 కి.మీ వరకూ వార్నింగ్