Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త జిల్లాల ఏర్పాటు.. ఎన్ని జిల్లాలంటూ.. జగన్ సర్కారు తర్జనభర్జన!?

కొత్త జిల్లాల ఏర్పాటు.. ఎన్ని జిల్లాలంటూ.. జగన్ సర్కారు తర్జనభర్జన!?
, మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:47 IST)
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన లేదా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో వైసీపీ సర్కారు డోలాయమానంగా వ్యవహరించేలా వుంది. కొత్తగా ఏర్పడే జిల్లాలు, పాత వాటితో కలిపి మొత్తం జిల్లాల సంఖ్య ఎంతనే విషయంలో వైసీపీ సర్కారు కసరత్తు చేస్తోంది. 
 
కొత్త జిల్లాలపై ఇదివరకే రూపొందిన రెవెన్యూ శాఖ రిపోర్టును కాదని, కొత్తగా చీఫ్ సెక్రటరీ సారధ్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం.. దానికి సంబంధించిన ఉత్తర్వులను రాత్రికి రాత్రే సవరించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పని ప్రారంభించిన సీఎస్ కమిటీ ముందుకు కీలక అంశాలు పరిశీలనకు వస్తున్నాయి. గందరగోళం నడుమ చివరికి కేసీఆర్ ఫార్ములానే ఖరారయ్యే అవకాశాలూ లేకపోలేవనే వాదన వినిపిస్తోంది.
 
పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా 25 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం సీఎస్ నీలం సాహ్ని ఆధ్వర్యంలో ఆరుగురితో కమిటీ వేస్తున్నామని ఏపీ ప్రభుత్వం ఈనెల 7న జీవో జారీ చేసింది. అయితే, అధ్యయనానికి ముందుగానే జిల్లాల సంఖ్యను 25కు ఫిక్స్ చేయడంపై విమర్శలు, అనుమానాలు వెల్లువెత్తాయి. 
 
దీంతో 24 గంటలు తిరక్కముందే.. మొత్తం జిల్లాలు 25 లేదా 26 అన్న పదాన్ని జోడిస్తూ శనివారం అర్ధరాత్రి దాటాక జీవోను సవరిస్తూ, కొత్తదాన్ని(జీవో నంబర్ 2101) జారీ చేశారు. అధ్యయన కమిటీకి మూడు నెలల గడువు విధించిన సంగతి తెలిసిందే. 
 
కొత్తగా ఏర్పడబోయే జిల్లాల సంఖ్యను 25 నుంచి 26కు పెంచుతూ జీవోను సవరించిన తర్వాత, సీఎస్ కమిటీ సైతం అదే దిశలో అధ్యయనాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. గిరిజన ప్రాంతాలకు అరకుతోపాటు ప్రత్యేకంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలనే అంశం కూడా కమిటీ ముందుకు వచ్చినటట్లు తెలుస్తోంది.
 
దేశంలో జిల్లాల ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలేవీ రూపొందించలేదు. ఏపీ నుంచి విడిపోయిన రెండేళ్లకే కేసీఆర్ సర్కారు కొత్త జిల్లాల్ని అమల్లోకి తెచ్చింది. తెలంగాణలో ఉన్నవి 17 లోక్ సభ స్థానాలే అయినా, ఆ సంఖ్యతో నిమిత్తం లేకుండా ఏకంగా 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో భిన్న భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఏపీలోనూ కేసీఆర్ ఫార్ములాను అనుసరించి, లోక్ సభ సెగ్మెంట్ల వారీగా కాకుండా ప్రజలకు సౌకర్యవంతంగా కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసిడి కొనేవారికి శుభవార్త.. బంగారం ధరలు పడిపోయాయి..