సురేష్ ప్రభుతో కలిసి చంద్రబాబు యోగాసనాలు... ప్రధాని మోదీతోనే(ఫోటోలు)
విజయవాడ: యోగా మన ప్రాచీన సంపద అని, యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది ప్రధానీ మోదీతోనే అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. యోగా ఒక రోజుకు పరిమితం కాకుండా జీవితంలో భాగం కావాలన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ1 కాన్వెన్షన్ సెంటర్
విజయవాడ: యోగా మన ప్రాచీన సంపద అని, యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది ప్రధానీ మోదీతోనే అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు.
యోగా ఒక రోజుకు పరిమితం కాకుండా జీవితంలో భాగం కావాలన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ1 కాన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రులు, అధికారులు, యోగా శిక్షకులతోపాటు సీఎం యోగాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మంచి జీవితం గడపడానికి యోగా అవసరమని, యోగా ఎంత అవసరమో మంచి ఆహారం కూడా అంత అవసరమన్నారు. యోగా మనిషిలో ప్రశాంతత కలుగచేస్తుందన్నారు. అతి కష్టమైన యోగాసనాలను కూడా చంద్రబాబు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.